ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌బండ్’ ఉద్రిక్తం.. అరెస్ట్‌లు, రాళ్లదాడి, లాఠీఛార్జ్

ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు

ఫొటో సోర్స్, Facebook/Y Vikram

ఫొటో క్యాప్షన్, ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలతో పాటు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు, తెలంగాణ జేఏసీ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.

అయితే, ఉదయం నుంచే ఈ నిరసన కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన పార్టీ నాయకులను పోలీసులు నిర్బంధించారు.

ట్యాంక్ బండ్ వద్ద పోలీసుల బందోబస్తు

ఫొటో సోర్స్, Facebook/Y Vikram

పలువురు నాయకులు, ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌వద్దకు చేరుకోగా వారిని అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

ట్యాంక్ బండ్ వద్ద పోలీసుల బందోబస్తు

ఫొటో సోర్స్, Facebook/Y Vikram

ట్యాంక్ బండ్‌వైపు వెళుతున్న ఆర్టీసీ కార్మికులు, టీజేఏసీ, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

కార్మికుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జిల్లో ఇరు వర్గాల్లో పలువురికి గాయాలు అయ్యాయి.

ఇందిరా పార్కు వద్ద కోదండరాంను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు

ఫొటో సోర్స్, facebook/TelanganaJanaSamithiParty

ఫొటో క్యాప్షన్, ఇందిరా పార్కు వద్ద కోదండరాం, తదితరులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు
ట్యాంక్ బండ్ వద్ద పోలీసుల బందోబస్తు
ట్యాంక్ బండ్ వద్ద పోలీసుల బందోబస్తు

ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్‌పై రాకపోకల్ని నిలిపివేసిన పోలీసులు సాయంత్రం ఆంక్షలు ఎత్తేసి, రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)