మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియా'గా వర్ణించారు.

మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు.

నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు.

తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

ఫాదర్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, EPA

"పెద్దమనుషులు ఇద్దరూ కలిస్తే, ఏదో ఒక పరిష్కారం వెతగలరని నాకు అనిపిస్తోంది. ఇద్దరూ కలిస్తే కచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతుంది" అని ట్రంప్ అన్నారు.

హ్యూస్టన్‌లో హౌడీ మోదీ కార్యక్రమం గురించి ప్రస్తావించిన ట్రంప్ ఆ కార్యక్రమంలో నరేంద్ర మోదీని చూడగానే జనాల్లో చాలా ఉత్సాహం వచ్చిందన్నారు.

"వారు ఈ పెద్ద మనిషిని చాలా ప్రేమిస్తున్నారు. ఆయన్ను చూసి పిచ్చెక్కి పోయారు. నరేంద్ర మోదీ అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రిస్లీ లాంటి వారు. నాకు ఎల్విస్ మళ్లీ వచ్చాడేమో అనిపించింది" అని ప్రశంసించారు.

ఫాదర్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్‌పై ప్రశ్నలు తోసిపుచ్చారు

అయితే ట్రంప్ పాకిస్తాన్‌లో తీవ్రవాదానికి సంబంధించి అడిగిన ప్రశ్నలను తోసిపుచ్చారు

పాకిస్తాన్‌లో ఐఎస్ఐ అల్-ఖైదాకు ట్రైనింగ్ ఇచ్చిందని చెప్పిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఒక జర్నలిస్ట్ స్పందన కోరినపుడు, ట్రంప్ "నేను ఆ వ్యాఖ్యలు వినలేదు. మీ ప్రధాన మంత్రి దీనిని చూస్తారని నాకు తెలుసు" అన్నారు.

"ఇరు దేశాల నేతలు(మోదీ, ఇమ్రాన్) కలిసి కశ్మీర్ అంశంపై ఏదైనా పరిష్కారం కనుగొంటే చాలా బాగుంటుంది. మేమంతా అది జరగడం చూడాలనే అనుకుంటున్నాం" ట్రంప్ అన్నారు.

ఫాదర్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, AFP

త్వరలో వ్యాపార ఒప్పందాలు

భారత్‌తో త్వరలో ఒక వ్యాపార ఒప్పందం జరగవచ్చని, దాని కోసం చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు.

"తర్వాత ఒక పెద్ద ఒప్పందం జరగచ్చు. కానీ త్వరలో రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ డీల్ జరుగుతుంది" అన్నారు.

అంతకు ముందు మాట్లాడిన భారత ప్రధాని 'హౌడీ మోదీ' కార్యక్రమానికి వచ్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పారు.

ఫాదర్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Reuters

అమెరికా నుంచి 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సహా, శక్తి రంగంలో పెట్టుబడులకు హ్యూస్టన్‌లో ఎంఓయూలు జరిగాయని చెప్పారు.

"ఈ ఒప్పందాల వల్ల వచ్చే కొన్ని దశాబ్దాల్లో 60 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది. 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భారత్ స్వయంగా దీనికి చొరవ తీసుకుంది" అన్నారు.

భారత్, అమెరికా రెండూ వేగంగా ముందుకు దూసుకువెళ్తున్నాయని మోదీ అన్నారు.

మోదీ, ట్రంప్ సమావేశం తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"పాకిస్తాన్‌తో చర్చల నుంచి భారత్, తప్పుకోవాలని అనుకోవడం లేదు. అది తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటే, మేం పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతాం. కానీ, అది ఇప్పటివరకూ అలా చేయలేదు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)