చిన్మయానంద: అత్యాచారం ఆరోపణలపై బీజేపీ నేత అరెస్టు

బీజేపీ నేత స్వామి చిన్మయానంద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజేపీ నేత స్వామి చిన్మయానంద

లైంగిక వేధింపుల ఆరోపణలపై బీజేపీ నేత చిన్మయానందను సిట్ బృందం ఆయన ఆశ్రమం నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

"ఈ ఉదయం స్వామి చిన్మయానందను ఆయన ఆశ్రమంలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారం. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేశాం. బాధితురాలి వీడియో ప్రామాణికతను ఫోరెన్సిక్ విభాగం పరిశీలిస్తుంది. చిన్మయానందపై అత్యాచారం కేసు కూడా నమోదు చేశాం" అని ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

స్నానం చేస్తున్న సమయంలో నన్ను వీడియో తీసిన చిన్మయానంద దాని సాయంతో నన్ను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారని ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ ఎస్ఎస్ న్యాయ కళాశాల విద్యార్థిని ఆరోపణలు చేశారు.

ఎదిరించే ధైర్యం లేకపోవడం, ఎవరి మద్దతూ లేకపోవడంతో సంవత్సరకాలం పాటు ఇలా తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం కూడా తమకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు.

చిన్మయానంద కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి మూడు సార్లు ఎంపీగా ఉన్నారు.

ఆయనపై ఈ ఆరోపణలు చేసిన నాటి నుంచి ఆ న్యాయ విద్యార్థిని ఆచూకీ లేకుండాపోయారు.

ఈ ఆరోపణలపై చిన్మయానంద స్పందన తెలుసుకోవడానికి గతంలో బీబీసీ ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన లేదు.

స్వామి చిన్మయానంద

ఫొటో సోర్స్, FB

ఫొటో క్యాప్షన్, స్వామి చిన్మయానంద

ఇప్పటి వరకూ ఏం జరిగింది?

షాజహాన్‌పూర్ న్యాయ కళాశాల విద్యార్థిని ఆరోపణలు చేసినా పోలీసులు ఇంతవరకూ దీనిపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసు నమోదు చేయలేదు.

ప్రస్తుతం ఈ విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. కానీ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా ఇప్పటి వరకూ ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంతలో బుధవారం నాడు వెలుగు చూసిన ఓ వీడియో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో చిన్మయానంద ఓ అమ్మాయికి మసాజ్ చేస్తూ, ఫోన్‌లో ఏదో టైప్ చేస్తూ కనిపించారు.

ఆ తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో చిన్మయానంద ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోల ప్రామాణికతను బీబీసీ స్వతంత్రంగా నిర్థరించలేదు.

గత నెలలో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, వేధింపుల ఆరోపణలపై చిన్మయానంద, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)