Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా హ్యూస్టన్‌లో ఆదివారం నిర్వహించిన 'హౌదీ మోదీ' కార్యక్రమంపై కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
దీనిని ట్రంప్ కోసం చేసిన ఎన్నికల ప్రచారంగా కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రధాని భారత విదేశాంగ విధానాలను ఉల్లంఘించారన్నారు.
అమెరికా ఎన్నికల స్టార్ ప్రచారక్‌లా అక్కడకు వెళ్లలేదనే విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుంచుకుని ఉండాలి అని ఆనంద్ శర్మ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'హౌడీ మోదీ' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఆయన ప్రసంగం అంతా తన పదవీకాలంలో చేసిన ఘనకార్యాలను చెప్పుకుని, తనను భారత-అమెరికా సమాజంతో జోడించుకోడానికి కేంద్రంగా మారింది.
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రధాని మోదీ ఏమన్నారు
కార్యక్రమం ప్రారంభంలో డోనల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసించారు.
ట్రంప్‌ను భారత్‌కు అసలైన స్నేహితుడుగా వర్ణించారు. డోనల్డ్ ట్రంప్‌ను తన స్నేహితుడుగా చెప్పిన ప్రధాని, ఆయన అధ్యక్షుడుగా ఉండడం వల్ల భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త కోణం లభించిందని చాలాసార్లు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ తన ప్రసంగంలో "భారత సంతతి వారు అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా బాగా కనెక్ట్ కాగలిగారు. క్యాండిడేట్ ట్రంప్ 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారీ ట్రంప్ ప్రభుత్వం) అనే మాటకు అర్థమేంటో కూడా మాకు స్పష్టమైంది" అన్నారు.
నిజానికి 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డోనల్డ్ ట్రంప్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన భారత్‌లోని అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఆ వీడియో చివర్లో ఆయన 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' అనే మాటను ఉపయోగించారు.
భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగినపుడు భారతీయ జనతా పార్టీ 'అబ్‌కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం ఉపయోగించింది. ఆ ఎన్నికల్లో విజయం కూడా సాధించింది.

ఫొటో సోర్స్, Pib
ఆనంద్ శర్మ విమర్శలు
హౌడీ మోదీ కార్యక్రమంపై కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ వరుస ట్వీట్స్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆయన "ప్రధానమంత్రిగారూ.. వేరే దేశాల అంతర్గత ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదన భారత విదేశాంగ విధానం సిద్ధాంతాన్ని మీరు ఉల్లంఘించారు. అది భారత దీర్ఘకాలిక దౌత్య ప్రయోజనాలకు విఘాతం లాంటిది" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరో ట్వీట్‌లో ఆయన "అమెరికాతో సంబంధాల విషయానికి వస్తే రిపబ్లికన్స్, డెమాక్రాట్స్‌తో భారత్ ఒకేలా ఉంటూ వస్తోంది. మీరు ఇలా బహిరంగంగా ట్రంప్ కోసం ప్రచారం చేయడం భారత్-అమెరికా లాంటి సౌర్వభౌమాధికార, ప్రజాస్వామ్య దేశాలనూ ఉల్లంఘించడం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చివర్లో "గుర్తుంచుకోండి. మీరు భారత ప్రధానమంత్రిగా అమెరికా వెళ్లారు. అమెరికా ఎన్నికల స్టార్ ప్రచారక్‌గా కాదు" అని ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- హౌడీ మోదీ: ఈ సభతో మోదీ, ట్రంప్‌ల్లో ఎవరికేంటి లాభం? అమెరికాలోని భారతీయుల ఓట్లన్నీ ట్రంప్‌కేనా?
- ట్రంప్ చేతులు కట్టుకున్న ఈ ఫొటో చెబుతున్న కథేంటంటే..
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- పాకిస్తాన్ నుంచి పారిపోయిన గులాలాయీ ఎవరు, ఆమె ఎందుకు అమెరికా చేరారు
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- గర్ల్‌ఫ్రెండ్‌కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








