Howdy Modi: మోదీ హూస్టన్ సభా ప్రాంగణం వెలుపల ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌లు పాల్గొంటున్న 'హౌడీ మోదీ' సభకు నిరసనల సెగ తగిలింది.
అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్వహిస్తున్న ఈ సభలో మోదీ, ట్రంప్‌లు భారత సంతతి అమెరికన్లనుద్దేశించి ప్రసంగించనున్నారు.

అయితే, కొద్దిరోజుల కిందట భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఈ హూస్టన్ సభాస్థలం వెలుపల నిరసన తెలుపుతున్నారు.
'స్టాండ్ విత్ కశ్మీర్', 'కశ్మీర్ ఈజ్ బ్లీడింగ్' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
గులాం నబీ అనే నిరసనకారుడు ‘బీబీసీ’తో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ అంతటా బలగాలు మోహరించి జనజీవితాన్ని నియంత్రించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, చిన్నారులు చిక్కుకుపోయారని అన్నారు.
డాలస్ నుంచి వచ్చిన షాకత్ అనే నిరసనకారుడు ‘కశ్మీర్ కోల్పోయిన స్వతంత్రత తిరిగి రావాల’న్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
హూస్టన్‌లో 72 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో ఈ 'హౌడీ మోదీ' సభ నిర్వహిస్తున్నారు.
టెక్సస్ ఇండియా ఫోరం, మరో 600 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 50 వేల మందికి పైగా భారత సంతతి అమెరికన్లు పాల్గొంటున్నారు.

మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సభకు వస్తుండడంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
మోదీ వ్యతిరేక నిరసనల వద్ద కూడా పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.
స్టేడియం వెలుపల ఎటుచూసినా పోలీసులే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- మరికొద్దిసేపట్లో ‘హౌడీ మోదీ’
- హౌడీ మోదీ: ఈ సభతో మోదీ, ట్రంప్‌ల్లో ఎవరికేంటి లాభం? అమెరికాలోని భారతీయుల ఓట్లన్నీ ట్రంప్‌కేనా?
- అమెరికా చేరుకున్న మోదీ.. 'Howdy Modi'లో ఏం జరగనుంది?
- 'మోదీ గెలిస్తే శాంతికి మెరుగైన అవకాశాలు'
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








