చిదంబరం అరెస్ట్: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రిని విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు

చిదంబరం

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని బుధవారం రాత్రి దిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు తప్పించుకునేందుకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణం విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తరువాత బుధవారం రాత్రి చిదంబరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే దిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు సీబీఐ, ఈడీ అధికారులు, దిల్లీ పోలీసులు చేరుకున్నారు.

చిదంబరం ఇంటి వద్ద సీబీఐ, ఈడీ అధికారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుధవారం రాత్రి చిదంబరం ఇంటి వద్ద సీబీఐ, ఈడీ అధికారులు

ఈ సందర్భంగా చాలాసేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దర్యాప్తు సంస్థల అధికారులను చిదంబరం ఇంటివద్ద సిబ్బంది, కార్యకర్తలు అడ్డుకోవంతో అధికారుల్లో కొందరు గేటు దూకి చిదంబరం ఇంట్లోకి ప్రవేశించారు.

అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అంతకుముందు- ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనపై ఏ నేరాభియోగమూ లేదని చిదంబరం చెప్పారు.

ఈ కేసులో తన కుటుంబంలో ఎవరిపైనా నేరాభియోగం లేదని ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.

ఈడీగాని, సీబీఐగాని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయలేదన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా సీబీఐ, ఈడీ చిదంబరంపై ఇప్పటికే లుక్‌ ఔట్ నోటీసు జారీచేశాయని ఏఎన్‌ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరానికి బుధవారం ఉదయం చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.

అంతకుముందు రోజు దిల్లీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

చిదంబరంపై మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. దీనిని ఈడీ దర్యాప్తు చేస్తోంది.

చిదంబరం బెయిల్

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఏమిటీ కేసు?

మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఐఎన్ఎక్స్‌కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన 'ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ)' ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది.

ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు.

చిదంబరం బెయిల్

ఫొటో సోర్స్, FACEBOOK/KARTI P CHIDAMBARAM

కార్తీ చిదంబరంపై ఆరోపణలు

ఐఎన్ఎక్స్ మీడియాపై జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారని పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపైనా ఆరోపణలు వచ్చాయి.

విచారణలో కార్తీ డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ తమకు చెప్పారని సీబీఐ చెబుతోంది.

ఈ ఒప్పందం దిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిందని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది.

ఇంద్రాణీ ముఖర్జీ ప్రస్తుతం తన కూతురు షీనా బోరా హత్య కేసులో జైల్లో ఉన్నారు.

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?

ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా, ఐఎన్‌ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10 రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి 4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఈ బోర్డు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్‌ఎక్స్ న్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది.

బోర్డు సిఫార్సుతో ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్‌ఎక్స్ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఐఎన్‌ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు.

4 కోట్ల 62 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతివ్వగా 305 కోట్లకుపైగా విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది.

చిదంబరం పేరు ఎలా వచ్చింది?

ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో 2008 ఫిబ్రవరిలో దీనిపై వివరణ ఇవ్వాలని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఎఫ్ఐపీబీని కోరారు. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖకు ఎఫ్ఐపీబీ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లేఖ రాసింది.

ఎఫ్ఐపీబీ నుంచి లేఖ అందుకున్న ఐఎన్ఎక్స్ మీడియా దీన్నుంచి తప్పించుకునేందుకు కార్తీ చిదంబరంతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. కార్తీ చిదంబరం అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు. చెస్ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రమోటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తే పని సాఫీగా సాగుతుందని ఆ సంస్థ భావించిందని సీబీఐ పేర్కొంది.

ఆ తర్వాత చెస్‌ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ సూచించినట్లుగా ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీకి లేఖ రాసింది. అన్ని వ్యవహారాలు సక్రమంగానే జరిగాయంటూ వివరణ ఇచ్చింది. కార్తీ చిదంబరం ఒత్తిడితో ఈ కేసును ఎఫ్ఐపీబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోకపోగా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నించారు. ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలోకి ఇదివరకే వచ్చిన డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి కోసం కొత్తగా ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులు చెప్పినట్లు ఐఎన్ఎక్స్ మీడియా అప్లికేషన్ పెట్టడం, ఎఫ్ఐపీబీ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ వివాదం నుంచి బయటపడేసినందుకు కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కి ఐఎన్ఎక్స్ మీడియా డబ్బులు చెల్లించినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)