జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు

ఫొటో సోర్స్, Sudhakarreddy/fb
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగులో విజయం సాధించిన మహానటి, రంగస్థలం సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల జాబితాలో మరొక పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఆయనే సుధాకర్ రెడ్డి యక్కంటి.
మరాఠీలో సంచలన విజయం సాధించిన 'నాల్' సినిమాకు దర్శకత్వం వహించిన తెలుగు వ్యక్తి ఆయన.
తెరకెక్కించిన మొదటి సినిమాతోనే అవార్డు కొట్టారు.
ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సుధాకర్ రెడ్డి 'ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు'కు ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Aatpat Production
గుంటూరు నుంచి బాలీవుడ్‌కు...
సుధాకర్ రెడ్డి యక్కంటి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశారు. పుణేలోని ఎఫ్టీఐఐ నుంచి పీజీ చేశారు.
నాల్ కంటే ముందు మరాఠీలో భారీ విజయాన్ని సాధించిన సైరాట్ చిత్రానికి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
తెలుగులో మధుమాసం, పౌరుడు, దళం సినిమాలకు పనిచేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఏమిటీ నాల్?
నాల్.. ఇటీవల మారాఠీలో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం.
తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు.
'నా జీవితంల్లోంచి వచ్చిన కథ'
నాల్ సినిమా కథ కల్పన అయినప్పటికీ తన జీవితానుభవాల ఆధారంగా రాసిన కథ అని చిత్ర దర్శకుడు సుధాకర్ రెడ్డి చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''నేను గోదావరి తీరంలో పెరిగాను. ఆ జీవితం ఆధారంగానే ఈ కథ రాసుకున్నా. 15 ఏళ్ల నుంచి ఈ కథ నా దగ్గర ఉంది. సినిమాటోగ్రాఫర్‌గా బిజీగా ఉండటంతో దీన్ని తెరకెక్కించడం కాస్త ఆలస్యం అయింది'' అని చెప్పారు.
''ఈ సినిమా తెలుగులో చేయకపోవడానికి ప్రత్యేకంగా ఏ కారణం లేదు. మరాఠీ ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే అవకాశం రావడంతో మరాఠీలోనే చేశా. అవకాశం వస్తే తెలుగులోనూ సినిమాలు చేస్తా'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Sudhakarreddy/fb
'అవార్డు ఊహించలేదు'
సినిమాటోగ్రాఫర్‌గా సినీ జీవితాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా అవార్డు కొట్టిన సుధకార్ రెడ్డి తనకు రెండు విభాగాలు ఒకటేనని చెప్పారు.
తన తొలి సినిమాకే అవార్డు వస్తుందని ఊహించలేదన్నారు.
''సినిమా తీస్తున్నప్పుడు అవార్డుల ఆలోచనే ఉండదు. మన కథను సరైన విధంగా తెరకెక్కిస్తున్నామా.. బడ్జెట్‌లో తీస్తున్నామా.. ప్రచారం ఎలా చేయాలి? అనే ఆలోచనలే ఉంటాయి. అవార్డు గురించి ఆలోచించే తీరిక, సమయం ఉండదు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Sudhakarreddy/fb
'సినిమాలకు ఎందుకొచ్చానంటే'
'సినిమా అంటేనే వెండితెరపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం. ఆ కోరికే నన్ను సినిమా వైపు నడిపించింది' అని సుధాకర్ రెడ్డి తెలిపారు.
తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా ఉండదని చెబుతున్న ఆయన ప్రస్తుతం బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








