#MeToo తను శ్రీ దత్తా: "నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల కేసును పోలీసులే నీరు గార్చారు"

ఫొటో సోర్స్, Reuters
బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, తాను పెట్టిన కేసును ముంబయి పోలీసులే నీరుగార్చారంటూ మండిపడ్డారు. 'ఆషిక్ బనాయా ఆప్నే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తనుశ్రీ గతంలో తెలుగులో 'వీరభద్ర' సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించారు.
నానా పాటేకర్‌పై తనుశ్రీ(35) గత ఏడాది చేసిన ఆరోపణలతో భారత్‌లో 'మీటూ' ఉద్యమం వ్యాప్తిలోకి వచ్చింది.
ఆధారాల్లేవని చెబుతూ నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల కేసును ముంబయి పోలీసులు తాజాగా ఉపసంహరించుకున్నారు.
"అవినీతిపరులైన పోలీసులు అంతకంటే అవినీతిపరుడైన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చారు" అని తనుశ్రీ వ్యాఖ్యానించారు.
పోలీసుల కేసు ఉపసంహరణ తర్వాత ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా చిత్రీకరణ సందర్భంగా సెట్స్‌లో తనపై నానా పాటేకర్ వేధింపులకు పాల్పడ్డారని తనుశ్రీ గత ఏడాది ఆరోపించారు. ఆయన చర్యలను వ్యతిరేకించినందుకు తనను బెదిరించారని చెప్పారు.
''పదేళ్ల కిందట ఓ బాలీవుడ్ పాట చిత్రీకరణ సమయంలో వేధింపులకు గురయ్యాను. దాని గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఘటన చేసిన గాయం నన్ను చాలాకాలం వెంటాడింది. దాంతో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను'' అని ఆమె నిరుడు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
వేధింపులపై తనుశ్రీ మాట్లాడటం మొదలుపెట్టాక చాలా మంది మహిళలు వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి పెదవి విప్పారు.
తనుశ్రీ ఆరోపణలను నానా పాటేకర్ ఖండిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'సాక్షుల నోరు మూయించారు'
కేసులో సాక్షులను బెదిరింపులతో నోరు మూయించారని, కేసును బలహీనపరిచేందుకు నకిలీ సాక్షులను తెరపైకి తెచ్చారని తనుశ్రీ తాజాగా ఆరోపించారు.
తనుశ్రీ తాజా ఆరోపణలపై పోలీసులుగాని, నానా పాటేకర్‌గాని స్పందించలేదు.
ఆమె పదేళ్ల క్రితమే మొదట ఆరోపణలు చేశారు. అవి నిరుడు సెప్టెంబరులో మళ్లీ తెరపైకి వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 'మీటూ' ఉద్యమం బాలీవుడ్‌లో ఎందుకు మొదలుకాలేదని ఒక ఇంటర్వ్యూలో తనుశ్రీని ప్రశ్నించగా- "నాకు పదేళ్ల క్రితం జరిగినదానినే నేటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో ఏ ఉద్యమమైనా ఎలా వస్తుంది" అని బదులిచ్చారు.
ఆమె వ్యాఖ్యలు తొలిసారిగా చిత్రపరిశ్రమలో, మీడియాలో, సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. కొందరు నటీమణులు కూడా ఆమెకు మద్దతుగా ముందుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నానా పాటేకర్‌పై కేసులో దర్యాప్తును కొనసాగించేలా ముంబయి హైకోర్టులో పిటిషన్ వేస్తామని తనుశ్రీ న్యాయవాది చెప్పారు.
"అణచివేతదారులు, అవినీతి వ్యవస్థపై ఒంటరి పోరాటం చేసి నేను అలసిపోయాను. కానీ, వేధింపులపై గళం విప్పితే ఎవ్వరూ వినిపించుకోరనేందుకు ఈ కేసును ఉదాహరణగా తీసుకోవద్దు" అని తన ప్రకటనలో తనుశ్రీ సూచించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై ఏమన్నాడంటే...
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: చమురు ట్యాంకర్ల పేలుళ్ళ వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అమెరికా
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- ‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’: ఉబర్
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేయనున్న ఏడు కీలక శక్తులు
- కోర్టులకు వేసవి సెలవులు అవసరమా...
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








