జగన్ ప్రెస్ మీట్: 'నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా'

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఇంత భారీ మెజార్టీ రావడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అయ్యుంటుందని జగన్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- దేశ చరిత్రలోనే ఇది గొప్ప విజయం
- మొత్తం ఎంపీ స్థానాలు 25 రావడం, 175 నియోజకవర్గాలలో 151 రావడం రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం.
- ఈ విజయం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైంది.
- ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతలను, విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది.
- ఇది ప్రజలు విశ్వసనీయతకు వేసిన ఓటు.
- విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు.
- అయిదు కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి ఇస్తాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఆ అవకాశం మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది.
- ఆ అవకాశం ఒక్కరికి వచ్చినప్పుడు... గవర్నమెంటు అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఏమిటో చూపిస్తాను.
- జగన్ అందరికన్నా మంచి ముఖ్యమంత్రిగా మీ అందరితో మన్ననలు అందుకుంటానని మనవి చేస్తున్నా.
- ఈ సందర్భంగా ప్రజలందరికీ రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- ఆరు నెలల నుంచి ఏడాది లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటానని మాటిస్తున్నా.
- ఈనెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తా.
పోస్ట్ Facebook స్కిప్ చేయండి
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- LIVE: జగన్ ప్రమాణ స్వీకారం 30న... నేటి సాయంత్రం చంద్రబాబు రాజీనామా
- LIVE: తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ... ఏపీలో ప్రభావం చూపని జనసేన: ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు
- వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా
- 40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఎగ్జిట్ పోల్స్ మీద ఎవరెవరు ఎలా రియాక్టయ్యారు...
- దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




