లోక్‌సభ ఎన్నికలు 2019: ఆరో దశలో పశ్చిమ బంగాల్‌లో 80 శాతం, దిల్లీ, బీహార్‌లలో 55 శాతం పోలింగ్

ఫొటో సోర్స్, @PIB_India
దేశంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో ఆరో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
మొత్తం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దిల్లీల్లో విస్తరించి ఉన్న 59 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
ఈరోజు పోలింగ్ జరిగిన 59 స్థానాల్లో 46 సీట్లను 2014 ఎన్నికల్లో బీజేపీ గెల్చుకుంది. యూపీఏ 11 సీట్లతో సరిపెట్టుకుంది.
ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు...
- ఉత్తరప్రదేశ్: 14 స్థానాలు
- హరియాణా: 10 స్థానాలు
- పశ్చిమ బెంగాల్: 8 స్థానాలు
- బిహార్: 8 స్థానాలు
- మధ్యప్రదేశ్: 8 స్థానాలు
- దిల్లీ: 7 స్థానాలు
- ఝార్ఖండ్: 4 స్థానాలు
ఆరో దశలో సాయంత్రం 5 గంటల వరకూ ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దిల్లీలో ఓటింగ్ శాతాన్ని పీఐబీ తన ట్విటర్‌లో ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సాయంత్రం 5.30కు హర్యానాలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది.

ఫొటో సోర్స్, EPA
మొదటి సారి ఉత్తరప్రదేశ్, బీహార్‌ను దాటిన దిల్లీ
సాధారణ ఎన్నికల ఆరో దశలో మొదటి సారి దిల్లీలో ఓటింగ్ శాతం ఉత్తరప్రదేశ్, బిహార్‌లను దాటింది.
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు దిల్లీలో 45.24 శాతం ఓటింగ్ నమోదైంది.
4 గంటల వరకూ ఉత్తరప్రదేశ్ 43.26 శాతం, బిహార్‌లో 44.4 శాతం ఓటింగ్ జరిగింది.
ఓటింగ్‌లో పశ్చిమ బెంగాల్ అన్నిరాష్ట్రాల కంటే ముందు నిలిచింది.
ఇక్కడ సాయంత్రం 4.15 నిమిషాల వరకూ 70.53 శాతం ఓటింగ్ నమోదైంది.
హర్యానాలో 51.97 శాతం, మధ్య ప్రదేశ్‌లో 52.78, జార్ఖండ్‌లో 58.08 శాతం ఓటింగ్ జరిగింది.

ఫొటో సోర్స్, President of India
దిల్లీలో మధ్యాహ్నం 2 గంటల వరకూ సుమారు 33 శాతం ఓటింగ్ జరిగింది.
ఏడు రాష్ట్రాలలో జరుగుతున్న ఆరో దశ ఎన్నికల్లో దిల్లీలోనే జనం తక్కువగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే చాలా ప్రాంతాల్లో వృద్ధులు కూడా ఓటు వేసేందుకు వరుసలో కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, ECU
ఓటు వేసిన ప్రధాన ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా, ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, సునీల్ చంద్రతోపాటు ఉప ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా తమ కుటుంబాలతో కలిసి దిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, ECI
పశ్చిమ బెంగాల్‌లో జోరుగా, దిల్లీ-బిహార్‌లో మందకొడిగా ఓటింగ్
ఆరో దశలో 59 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 29.44 శాతం ఓటింగ్ జరిగింది.
- బిహార్: 21%,
- హరియాణా: 30.09%,
- మధ్యప్రదేశ్: 32.21%,
- ఉత్తర ప్రదేశ్: 28.10%,
- పశ్చిమ బెంగాల్: 40.98%,
- ఝార్ఖండ్: 41.21%
- దిల్లీ: 20.08%
ఎన్నికల కమిషన్ వోటర్ టర్నవుట్ యాప్ ఈ గణాంకాలు తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థితో ఘర్షణ
పశ్చిమ బెంగాల్‌లో పశ్చిమ మెదినీపూర్ జిల్లాలోని ఘాటాల్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్ తృణమూల్ పార్టీ కార్యకర్తలు తనపై చేయిచేసుకున్నారని ఆరోపించారు.
ఇటు తృణమూల్ నేతలు భారతి కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దీనిపై స్థానిక కలెక్టర్ నుంచి నివేదిక కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతోంది: ప్రియాంక గాంధీ
ఓటు వేసిన తర్వాత మాట్లాడిన ప్రియాంక గాంధీ బీజేపీ ఘోరంగా ఓడిపోబోతోందని అన్నారు. ప్రజల కోపం, విసుగును ఈ ఎన్నికల ద్వారా బయటపడుతుందన్నారు. ఉత్తర ప్రదేశ్ ఓటర్లలో ఆ కోపం తనకు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఓటు వేసిన ప్రియాంక గాంధీ
లోధీ ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రాతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, ECI
ఉదయం 12 గంటలకు నమోదైన పోలింగ్ శాతం: 25.13%
- బిహార్: 20.7%
- హరియాణా: 23.26%
- మధ్య ప్రదేశ్: 28.25%
- ఉత్తర్ ప్రదేశ్: 21.75%
- పశ్చిమ బెంగాల్: 38.26%
- ఝార్ఖండ్: 31.27%
- దిల్లీ: 19.55%
దిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దిల్లీలోని మాలవీయ నగర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజంగఢ్ నియోజక వర్గం పరిధిలో కొన్ని బూత్‌లలో ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ చురుగ్గా సాగుతోంది. దిల్లీ, బిహార్‌లలో ఇప్పటివరకూ మందకొడిగా సాగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
దిల్లీలోని సంచార్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సీపీఐ(ఎం) నేత ప్రకాశ్ కరాత్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఓటు వేసిన రాహుల్ గాంధీ
"ఈ ఎన్నికలు నోట్లరద్దు, రైతు సమస్యలు, గబ్బర్ సింగ్ ట్యాక్స్, రఫేల్ కుంభకోణం వంటి అంశాల ప్రాతిపదికగా జరిగే పోరాటమే ఈ ఎన్నికలు. నరేంద్ర మోదీ తన ప్రచారంలో ద్వేషాన్ని వెళ్లగక్కితే, మే మాత్రం ప్రేమను నమ్ముకున్నాం. ప్రేమ తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నా" అని ఓటు వేసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్ ప్రదేశ్‌లో ఈరోజు పోలింగ్ జరుగుతున్న 14 నియోజక వర్గాల్లో 2014లో బీజేపీ 13 స్థానాల్లో గెల్చింది. ఒక్క ఆంజంఘడ్‌లో మాత్రం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గెలిచారు. 2019లో బీజేపీకి ఇక్కడ గట్టి సవాలే ఎదురైంది. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, President of india
రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, Ani
దిల్లీలోని మథురా రోడ్డులోని దిల్లీ పబ్లిక్ స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఆయన భార్య రోమీ భాటియా, కుమార్తె అమియా ఓటు వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఈ దశలో బరిలో ఉన్న 979మంది అభ్యర్థుల్లో మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, రీటా బహుగుణ జోషీ, దిలీప్ ఘోష్, మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, షీలా దీక్షిత్, భూపిందర్ సింగ్ హుడా, కీర్తి ఆజాద్ వంటి వారు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఈశాన్య దిల్లీ అభ్యర్థి షీలా దీక్షిత్ నిజాముద్దీన్ తూర్పు ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"మరో దశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలన్నింట్లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత భారీగా రికార్డు స్థాయిలో తరలిరావాలి. వారి భాగస్వామ్యమే పోలింగ్‌కు ఓ ప్రత్యేకతనిస్తుంది" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురుగ్రామ్‌లోని పైన్‌క్రెస్ట్ స్కూల్ ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన విరాట్ కోహ్లీ తన ఓటును వేశారు.

ఫొటో సోర్స్, ANI
తూర్పు దిల్లీ తరపున బీజేపీ తరపున లోక్‌సభకు పోటీచేస్తున్న గౌతం గంభీర్ ఓల్డ్ రాజేంద్ర నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
బీజేపీ భోపాల్ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తన ఓటు వేశారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ పోటీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బరిలో ఉన్న ప్రముఖులు...
బీజేపీ నుంచి: క్రికెటర్ గౌతం గంభీర్, కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, హర్ష్ వర్ధన్, నరేంద్రసింగ్ తోమార్, దిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారి, ఝార్ఖండ్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తదితరులు ఆరో విడత బరిలో పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి: సీనియర్ నాయకులు షీలా దీక్షిత్, దిగ్విజయ్ సింగ్, భూపీందర్ సింగ్ హూడా, జ్యోతిరాదిత్య సింధియా, బాక్సర్ విజేందర్ సింగ్, క్రికెటర్ కీర్తి ఆజాద్ తదితరులు తలపడుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి: పంకజ్ గుప్తా, ఆతిషి, దిలీప్ పాండే, రాఘవ్ చద్దాలు పోటీ చేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో బహుముఖ పోటీ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
10.17 కోట్ల ఓటర్లు.. 979 మంది అభ్యర్థులు..
పోలింగ్ జరుగుతున్న 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవిష్యత్తును మొత్తం 10.17 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 4.75 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు.
దిల్లీలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు 164 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 16 మంది మహిళలు, 43 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
హరియాణాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో 11 మంది మహిళలు సహా 233 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా సరిహద్దులను మూసివేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజంఘడ్ సీటు నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి మేనకా గాంధీల భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజు తేల్చనున్నారు.
బిహార్‌లోని తూర్పు చంపారన్ స్థానం నుంచి కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు.
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్‌ను బరిలో నిలిపింది. 16 సంవత్సరాల తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
మరో సీటు గుణ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎక్కువ కాలంపాటు సింధియా కుటుంబం చేతిలోనే ఉంది. నాలుగు సార్లు బీజేపీ గెలిస్తే, తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఒక్కసారి జన్ సంఘ్ వశమైంది. సింధియా కుటుంబం నుంచి రాజమాత విజయరాజె సింధియా, మాధవరావ్ సింధియా, జ్యోతిరాదిత్య సింధియాలే ఇక్కడ నుంచి గెలుస్తూ వచ్చారు.
మాధవరావ్ సింధియా మరణం తర్వాత 2002లో వచ్చిన ఉపఎన్నికల నుంచి జ్యోతిరాదిత్య గెలస్తూ వస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ తన వ్యూహాన్ని మార్చి, సింధియాలకు నమ్మకస్తుడిగా పేరున్న కేపీ యాదవ్‌కు ఇక్కడినుంచి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది.
ఇవి కూడా చదవండి
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- మన్ను తిన్న చిన్నారి మట్టిలో కలిసిపోయింది.. ఆ పాపం ఎవరిది
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)