ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయనగరంలో అత్యధికంగా 74.18 శాతం పోలింగ్.. విశాఖలో అత్యల్పంగా 55.82 శాతం

రోజా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఇప్పటివరకు అత్యధికంగా విజయనగరంలో 74.18 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 55.82 శాతం పోలింగ్ నమోదైంది.

మధ్యాహ్నం 5గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల వీటిని సరిచేయగలిగారు.

సాంకేతిక కారణాలతో 381 ఈవీఎంలు మొరాయించాయని.. అవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని ఈసీ ద్వివేది తెలిపారు.

20 చోట్ల ఘర్షణలు జరిగాయని, ఒక హత్య జరిగిందని ద్వివేది చెప్పారు.

ఈవీఎంలు పనిచేయకపోవడం పోలింగ్‌ శాతంపై తీవ్ర ప్రభావం చూపిందని టీడీపీ నేత చంద్రబాబు ఆరోపించారు. 157 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)