ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు వీరే...

బాబు

ఫొటో సోర్స్, FB/NCBN

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు ఫైల్ ఫొటో

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది.

ఆంధప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలి జాబితాలో 126 మంది అభ్యర్థులను, రెండో జాబితాలో 15 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. తాజాగా 34 పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది.

లోక్‌సభకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.

ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్‌కు అరకు టికెట్ కేటాయించారు. అమలాపురం స్థానాన్ని తాజాగా టీడీపీలో చేరిన హర్ష కుమార్‌కు కేటాయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ, అక్కడ గంటి హరీశ్‌ బరిలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తిరుపతి, కర్నూలు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)