"నా ఓటు గల్లంతైంది... ఒక పౌరురాలిగా నేను మోసపోయాను" - శోభన కామినేని

అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె చాలా కాలంగా హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పోలింగ్ కేంద్రంలో తన వోటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు.
గతవారం చెక్ చేసుకున్నప్పుడు కూడా ఓటర్ల జాబితాలో తన పేరు ఉందని, తీరా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళితే కనిపించలేదని శోభన అన్నారు. సినీ నటుడు రామ్‌చరణ్ అత్త అయిన శోభన బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నిన్ననే హైదరాబాద్‌కు వచ్చారు.
"ఒక పౌరురాలిగా నేను మోసపోయాను. నా ఓటు ముఖ్యం కాదా? గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు వేశాను. ఈసారి ఎలా గల్లంతవుతుంది" అని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించారు.
ఇది చాలా దారుణమని, ఈ విషయాన్ని ఇలా వదిలేయనని కూడా ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




