భారతదేశం ఎన్నికలు... ఆరు వారాల పెళ్ళి సంబరాలు

వీడియో క్యాప్షన్, ఎన్నికల సంబరం

భారత దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు కాబోతున్నాయి.

దీనిని ఒక పెద్ద వివాహ సంబరంలా అనుకుంటే, ఇక్కడ అతిథుల జాబితా చాలా పెద్దదే.

దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ సంఖ్య అమెరికా, యూరోపియన్ యూనియన్ జనాభా కంటే ఎక్కువ.

భారత దేశంలో ఎన్నికలు వివిధ దశల్లో జరగబోతున్నాయి. ఏప్రిల్, మే మధ్య ఈ ఎన్నికలు ఆరు వారాలపాటు జరుగుతాయి.

ఎన్నికలు సంబరం

ఇంత భారీ ఎన్నికల నిర్వహణకు... దేశవ్యాప్తంగా పది లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు

వీటి నిర్వహణకు చాలా వనరులు, ప్రణాళికలు సిద్ధం చేశారు.

క్షేత్రస్థాయిలో దాదాపు కోటి మంది అధికారులను ఎన్నికల విధుల్లో మోహరించారు. ఇది స్వీడన్ జనాభాతో సమానం.

ఎన్నికలు సంబరం

ఈ ఎన్నికలకు చాలా నిధులు వెచ్చిస్తున్నారు. వీటికి 2016లో అమెరికా ఎన్నికలకు జరిగిన 6.5 బిలియన్ డాలర్ల వ్యయం కంటే ఎక్కువే అవుతుందని అంచనా.

అయితే, ఇక్కడేం జరుగుతోంది?

ఎన్నికలు సంబరం

గత ఎన్నికల్లో 450 పార్టీలు పోటీ చేస్తే, ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. తిరిగి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు.

కానీ, భారత దేశ లౌకిక, భిన్నత్వ లక్షణాలను బీజేపీ అణచివేయవచ్చని విమర్శకులు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో మోదీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు, కానీ ఈసారి ఏం జరగబోతోంది. ప్రజాస్వామ్యంలో జరిగే ఈ ఓట్ల పండుగే దానిని నిర్ణయిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)