రాహుల్ గాంధీ: వాయనాడ్‌నే దక్షిణాది నుంచి ఎందుకు ఎంచుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా రెండు స్థానాల నుంచి పోటీచేయనున్నారు.
ఇంతకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంతోపాటు దక్షిణాదిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ ఆదివారం దిల్లీలో మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
వాయనాడ్‌లో ఏప్రిల్ 23న, అమేథీలో మే 6న పోలింగ్ జరుగనుంది.

ఫొటో సోర్స్, Twitter/Congress
రాహుల్ 2004 నుంచి అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
రాహుల్ వాయనాడ్ నుంచి కూడా పోటీచేయాలంటూ అనేక విజ్ఞప్తులు వచ్చాయని ఆంటోనీ చెప్పారు. ఆయన దక్షిణాది నుంచి పోటీచేయాలని కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కొన్ని వారాలుగా కార్యకర్తల నుంచి మళ్లీ మళ్లీ విజ్ఞప్తులు, డిమాండ్లు వచ్చాయని తెలిపారు.
కేరళతోపాటు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు రాహుల్ వాయనాడ్‌లో బరిలోకి దిగుతున్నారని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ విజ్ఞప్తులపై కాంగ్రెస్ చర్చించిందని ఆంటోనీ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ ఏకగ్రీవ అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని తాము రాహుల్‌కు సూచించామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, వాయనాడ్ నుంచి పోటీచేయడానికి సమ్మతి తెలిపారని చెప్పారు.
'అమేథీ రాహుల్ కర్మభూమి'
వాయనాడ్ భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్థానాన్ని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
‘‘అమేథీ తన కర్మభూమి అని రాహుల్ చాలా సార్లు చెప్పారు. అమేథి నియోజకవర్గం రాహుల్‌కు కుటుంబం లాంటిది. అమేథీని ఆయన వదులుకోరు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/RahulGandhi
వాయనాడ్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. దీనిని కాంగ్రెస్ సురక్షిత స్థానాల్లో ఒకటిగా భావిస్తారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐ షానవాస్ విజయం సాధించారు.
2018లో ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.
2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ రెండో స్థానంలో నిలిచింది.
2009లో కాంగ్రెస్ 1,53,439 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ ఆధిక్యం బాగా తగ్గి, 20,870 ఓట్లకు పరిమితమైంది.
2014లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ
వాయనాడ్‌లో 2009లో 31,687 ఓట్లతో( 3.85 శాతం) నాలుగో స్థానంలో నిలిచిన బీజేపీ, 2014లో 80,752 ఓట్లు (8.83 శాతం) సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుత ఎన్నికల్లో పాలక వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్) తరపున సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్ వాయనాడ్‌లో బరిలోకి దిగుతున్నారు.
వాయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
- 'గంగ ప్రక్షాళన జరిగిందా? మేం ఆ నీటిని పరీక్షించాం.. అందులో ఏం తేలిందంటే...'
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- యాపిల్ అసాధారణ నిర్ణయం..
- "మెజారిటీ ప్రజలకు మేలు జరగకపోతే వారే తిరుగుబాటు చేస్తారు"
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- 82 శాతం సంపద ఒక్క శాతం కుబేరుల చేతిలో!
- ‘అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- ఫేస్‌బుక్: ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే వేదికగా మార్చేస్తామంటున్న మార్క్ జుకర్‌బర్గ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








