పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానం కూల్చినప్పటి రాడార్ చిత్రాలు విడుదల చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్ చిత్రాలు

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన రాడార్ చిత్రాలు

భారత వైమానిక దళం రాడార్ ద్వారా తీసిన చిత్రాలను సోమవారం (ఏప్రిల్ 8వ తేదీన) విడుదల చేసింది.

2019 ఫిబ్రవరి 27న ‘మా ఎఫ్-16 యుద్ధ విమానం ధ్వంసం కాలేద’ని చెప్పిన పాక్ వాదనలకు భారత్ ఈ ఫొటోల ద్వారా సమాధానం ఇచ్చింది.

అదే రోజున పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత వైమానిక దళం చెప్పింది.

పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్.. ఐఏఎఫ్ దీని గురించి మరింత సమాచారం బహిరంగం చేయలేదని చెప్పారు. ఎందుకంటే అది భద్రత, గోప్యత లాంటి షరతులను ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు.

"రాడార్ నుంచి తీసిన చిత్రాల్లో నియంత్రణ రేఖకు పశ్చిమంగా వింగ్ కమాండర్ వర్దమాన్ పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఎదుర్కున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని, రెండో ఫొటోను పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానం మాయమైన పది సెకన్ల తర్వాత తీశారని" ఎయిర్ వైస్ మార్షల్ చెప్పారు. పాకిస్తాన్ అదే ఎఫ్-16 విమానాన్ని కోల్పోయిందన్నారు.

గత వారం అమెరికా వార్తా పత్రిక 'ఫారిన్ పాలసీ'.. అమెరికా భద్రతా అధికారుల సమాచారం ప్రకారం అమెరికా పాకిస్తాన్ నుంచి ఎన్ని ఎఫ్-16లు అమ్మిందో అవన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్ చిత్రాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్

వాటిలో ఏ విమానం కూడా మాయం కాలేదని తెలిపింది. ఈ రిపోర్ట్ తర్వాత రెండు దేశాల మధ్య వివాదం మరింత రాజుకుంది.

వైస్ మార్షల్ కపూర్.. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎఫ్-16ను మిగ్ 21 బైసన్ విమానం కూల్చేసిందని చెప్పారు. ఫిబ్రవరి 27న రెండు విమానాలు కూలిపోయాయనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇందులో ఒకటి భారత వైమానిక దళ మిగ్ బైసన్ అయితే, ఇంకొకటి పాకిస్తాన్ ఎఫ్-16 అని తెలిపారు.

భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చారని చెబుతోంది. కానీ అది కూడా నియంత్రణ రేఖకు అవతల ల్యాండ్ అయ్యింది. అందుకే పాకిస్తాన్ భద్రతా బలగాలు ఆయన్ను అరెస్టు చేశాయి. ఆయన మూడు రోజుల వరకూ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు.

ఇటు పాక్ సైన్యం ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాత్రం భారత్ వాస్తవాలను తొక్కి పెడుతోందని అన్నట్టు పాక్ పత్రికలు తెలిపాయి.

"ఫిబ్రవరి 27న తాము కూల్చిన భారత మిగ్-21 బైసన్ యుద్ధ విమానం శిథిలాల్లో లభించిన నాలుగు మిసైళ్లు ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉన్నాయని" ఆయన చెప్పారని ఆ దేశ పత్రికలు రాశాయి.

పాకిస్తాన్ సైన్యం దగ్గర చెప్పడానికి ఇంకా చాలా నిజాలు ఉన్నాయని గఫూర్ అన్నట్లు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)