వింగ్ కమాండర్ అభినందన్‌లా మీసం మెలేస్తున్న భారత యువత

అభినందన్ మీసకట్టు
    • రచయిత, ఇమ్రాన్ కురేషీ
    • హోదా, బీబీసీ కోసం

ఇటీవల పాక్ నుంచి విడుదలైన భారత ఫైటర్ జెట్ పైలెట్ అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు ఒక నేషనల్ ఫిగర్ అయిపోయారు.

ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు, ప్రకటనల్లో అంశంగా మారిపోయారు. అంతే కాదు దేశంలో సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు.

ప్రత్యేకంగా ఉండే అభినందన్ మీసాలు ఇప్పుడు భారత్‌లో చాలా పాపులర్.

చాలామంది ఇప్పుడు తమ మీసాలను అతడిలాగే ట్రిమ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన స్టైల్‌ను ఫాలో అవుతూ అభినందన్‌పై తమ గౌరవం చాటుకుంటున్నారు.

అభినందన్ మీసకట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫైటర్ జెట్ కూల్చిన తర్వాత అభినందన్‌ను అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే భారత్‌ దేశమంతటా ఆయన ఒక హీరో అయిపోయారు.

శుక్రవారం తిరిగి స్వదేశానికి వచ్చిన అభినందన్‌కు దేశమంతా స్వాగతం పలికింది.

అభినందన్ మీసకట్టు

ఫొటో సోర్స్, Getty Images

అభినందన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి అతడి మీసాలను భారత యువత శౌర్యానికి చిహ్నంగా భావించింది.

దేశంలో ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం తమ సరికొత్త ప్రకటనను డిజైన్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఫైటర్ పైలెట్ అభినందన్ మీసాలను సూచించే ఒక వీడియోనే తయారు చేసింది.

వంపు తిరిగిన మీసకట్టు ఉండడం భారత్‌లో వింతేం కాదు.

ఒకప్పుడు సినిమాలో క్రూరమైన విలన్లు, గూండాల పాత్రల కోసం, తర్వాత ఎవరికీ లొంగని పోలీస్, మిలట్రీ ఆఫీసర్ల గురించి చెప్పాలన్నా, వారి మీసాలు తిప్పి ఉన్నట్లు చూపించేవాళ్లు.

కానీ ఈ వంపు తిరిగిన మీసకట్టు గత కొన్నిరోజులుగా దేశభక్తికి, ధైర్యానికి, వీరత్వానికి చిహ్నంగా మారిపోయింది.

అభినందన్ మీసకట్టు
ఫొటో క్యాప్షన్, అభినందన్‌లాగే తేజస్ చౌదరి మీసకట్టు

బెంగళూరులోని ఒక హెయిర్ కటింగ్ సెలూన్ అయితే పైలెట్ అభినందన్‌ లాంటి మీసాలు కోరుకుంటున్న వారికి సోమవారం నుంచి ఉచితంగా అలాంటి స్టైలింగ్ చేస్తానంటూ ముందుకొచ్చాయి.

"అభినందన్ మన దేశం కోసం చాలా చేశారు. అందుకే ఇప్పుడు అందరూ అతడిలా కనిపించడానికి ప్రయత్నించాలని నాకు అనిపిస్తోంది" అని ఒక హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని ననేష్ ఠాకూర్ బీబీసీకి చెప్పారు.

కానీ, అభినందన్ లాంటి హెయిర్ స్టైల్ ఉచితంగా ఆఫర్ చేసినప్పటికీ, ముగ్గురికి మాత్రమే అతడి లాంటి మీసాల స్టైల్ చేయగలిగానని ఆయన చెప్పారు.

ముగ్గురిలో అభినందన్ లాగే మీసాలు ట్రిమ్ చేయించుకున్న తేజస్ చౌదరి వింగ్ కమాండర్ కోసమే తన మీసాలను మార్చుకున్నట్లు చెప్పారు. "ఆయన మన దేశం కోసం చాలా చేశారు. నేను ఈమాత్రం చేయలేనా" అన్నారు.

అభినందన్ మీసకట్టు
ఫొటో క్యాప్షన్, అభినందన్ మీసకట్టు ఫ్రీగా చేస్తామంటూ బెంగళూరులో ఒక సెలూన్ ప్రకటన

అంబులెన్స్ డ్రైవరుగా పనిచేసే నవీన్ కుమార్ కూడా అభినందన్‌లా తన మీసాలు కట్ చేయించుకున్నారు. అభినందన్‌ను అసలైన హీరోగా వర్ణించారు. అందుకే తన మీసాలు అతడిలాగే మార్చుకున్నానని చెప్పారు.

అభినందన్‌లాగే తమ మీసాలు సెట్ చేసుకోడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ "వాళ్ల మీసాలు అలా వంపు తిరిగేలా చేయడానికి తగినంత పొడవుగా లేవు" అని ఠాకూర్ చెప్పారు.

అభినందన్ మీసాల స్టైలును 'గన్ స్లింగర్' అంటారు. మీసాలు అలా చేసుకోలేకపోయినా చాలామంది ఠాకూర్ దగ్గర మిలిటరీ ఆఫీసర్స్‌లా 'క్రూ కట్' చేయించుకుని తృప్తి పొందారు.

దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది వింగ్ కమాండర్ అభినందన్ స్ఫూర్తితో అతడిలాగే మీసాలు పెట్టుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అభినందన్ వీడియో విడుదల చేసింది. అందులో అతడి ముఖంపై రక్తం ఉండడం, తన కళ్లకు గంతలు కట్టి ఉండడాన్ని చాలా మంది చూశారు. కాసేపటి తర్వాత పాక్ ఆ వీడియోను తొలగించింది.

తర్వాత పాక్ విడుదల చేసిన వీడియోలో అభినందన్ టీ తాగుతూ కనిపించారు. తన పేరు, మిలిటరీ ర్యాంక్ గురించి చెప్పారు. తను దక్షిణాది వాడినని అన్నారు. కానీ మిగతా వివరాలేవీ చెప్పడానికి కుదరదని కచ్చితంగా చెప్పారు.

అభినందన్ మీసకట్టు

ఫొటో సోర్స్, iSpr

ఆ క్లిప్ వైరల్ కావడంతో పాక్‌కు ధైర్యంగా జవాబు చెప్పిన అభినందన్‌ను చాలా మంది ప్రశంసించారు. ఆ తర్వాత వెంటనే #BringBackAbhinandan అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అభినందన్ విడుదల రోజు వాఘా సరిహద్దు దగ్గర అతడికోసం జాతీయ జెండాతో జనం భారీగా ఎదురుచూశారు. శుక్రవారం పాక్ అధికారులు అతడిని భారత్‌కు అప్పగించారు.

అభినందన్ విడుదలతో దిల్లీ సహా దేశమంతటా పండగ వాతావరణం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)