భారత్ - పాక్: ఓ విమానాన్ని కూల్చేశాం.. మరో విమానాన్ని కోల్పోయాం, పైలెట్ అచూకీ తెలియడం లేదు - భారత్

విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, MEA

భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. ఆ వివరాలు..

‘తీవ్రవాదం వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత్ నిన్న పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.

భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఈ ఉదయం స్పందించింది.

పాక్ తమ వైమానిక దళంతో దాడికి ప్రయత్నించింది.

అప్రమత్తంగా ఉన్న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది.

పాకిస్తాన్‌ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను మన మిగ్ 21 బైసన్ విమానంతో కూల్చేశాం.

ఆ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం మన ఆర్మీ చూసింది.

అదే సమయంలో మనం దురదృష్టవశాత్తూ ఒక మిగ్ 21 కోల్పోయాం.

ఆ విమానంలో పైలెట్ మిస్ అయ్యారు.

అయితే ఆ పైలెట్ తమ కస్టడీలో ఉన్నట్టు పాకిస్తాన్ పేర్కొంటోంది.

ఇందులోని వాస్తవాలను భారత ప్రభుత్వం నిర్ధారించుకునే పనిలో ఉంది.’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)