డిస్‌లెక్సియా అంటే ఏంటి? ఇది పిల్లల్లో వస్తుందా, పెద్దవారిలో వస్తుందా? దీనికి చికిత్స ఉందా?

డిస్‌లెక్సియా అంటే

డిస్‌లెక్సియా అంటే ఏంటి? ఇది పిల్లల్లో వస్తుందా, పెద్దవారిలో వస్తుందా? దీనికి చికిత్స ఉందా?

"డిస్‌లెక్సియాతో బాధపడేవారికోసమే మా ఈ ఆలోచన. నేర్చుకోవడంలో, రాయడంలో వారికి ఇబ్బందులుంటాయి. కానీ వారి తెలివితేటలు, సృజనాత్మకత స్థాయులు చాలా బాగుంటాయి" అని ఓ విద్యార్థి వివరిస్తుంటే దానికి ప్రధాని మోదీ ఓ ప్రశ్న వేశారు.

"40-50 ఏళ్ల వయసున్న వారికి కూడా ఇది పనికొస్తుందా?" అని.

"కచ్చితంగా పనిచేస్తుంది" అని ఆ అమ్మాయి సమాధానమిచ్చింది.

వీడియో క్యాప్షన్, డిస్‌లెక్సియా అంటే?

రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా విమర్శలే వచ్చాయి.

అసలు డిస్‌లెక్సియా అంటే ఏమిటనే చర్చ మొదలైంది.

"డిస్‌లెక్సియా అనేది ఓ లెర్నింగ్ సమస్య. భారత్‌లో 3.5కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు" అని స్పెషల్ ఎడ్యుకేటర్ గీత్ ఒబెరాయ్ తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి, మేము ఫొనోలాజికల్ ఇంటర్వెన్షన్ అనే పద్ధతిని ఉపయోగిస్తాం. దీనిలో పిల్లలకు వివిధ శబ్దాలు నేర్పిస్తాం. ఒకటి, రెండక్షరాలే కాదు, ఎక్కువ అక్షరాలున్నవి కూడా ఈ పద్ధతిలో పిల్లలకు నేర్పిస్తాం. డిస్‌లెక్సియాను ఏడేళ్ల వయసు వచ్చేవరకూ గుర్తించలేం. తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ ఎవరైనా పిల్లలు డిస్‌లెక్సియాతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే, ఆ పిల్లలను వెంటనే కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లాలి అని గీత్ ఒబెరాయ్ సూచించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)