మాయావతి: ఒక మహిళను ఒక మహిళే ఎందుకు అవమానించింది

ఫొటో సోర్స్, AFP
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ మహిళా ఎమ్మెల్యే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపై అధికారం కోసం గౌరవాన్నే అమ్ముకుంటుందనే వ్యాఖ్యలు చేశారు.
బహుశా మీరూ వినే ఉంటారు. బీజేపీ మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ "బీఎస్పీ నేత మాయావతి మగా, ఆడా? నాకు అర్థం కావడం లేదు" అన్నారు. ఆమె అధికారం కోసం పరువు ప్రతిష్టలే అమ్ముకున్నారని కామెంట్ చేశారు.
సాధనా సింగ్ ఇప్పుడు తన వ్యాఖ్యలకు క్షమాపణ అడిగారు. కానీ మాయావతి రూపం గురించి ఆమె మహిళలా ఉండడం లేదని, మహిళా నేతలే తరచూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రతిసారీ అంతకు ముందు కంటే ఘోరంగా అవమానించారు.
కానీ దానికి కారణం తెలుసుకునే ముందు మహిళలే కాదు, పురుషులు కూడా అందులో వెనక్కు తగ్గలేదనే మాటను చెప్పుకోవాలి.
1990 దశకంలో మాయావతి మొదటిసారి జుట్టు పొట్టిగా కత్తిరించుకున్నప్పుడు ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆమెను 'పొట్టి జుట్టు' మహిళ అన్నారు.
అంటే మంచి భారతీయ మహిళ పొడవాటి జుట్టు ఉంచుకుంటుంది. జుట్టు కత్తిరించుకుంటే మాత్రం పొట్టి జుట్టు, పాశ్చాత్య సంస్కృతి పాటించేవారు అవుతారు.

ఫొటో సోర్స్, SADHNA SINGH FB / GETTY IMAGES
1995లో ఉత్తర ప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ఎస్పీ కార్యకర్తలు రాష్ట్ర గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న మాయావతిపై దాడి చేశారు.
ఈ దాడి తర్వాత ములాయం సింగ్ యాదవ్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.
20 ఏళ్ల తర్వాత కూడా ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ చెప్పారు. మాయవతిపై రాసిన ఒక వ్యాసంలో... ఆమె అత్యాచారం ఆరోపణలు చేసిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ అదే ఏడాది మొయిన్‌పురిలో జరిగిన ఒక ర్యాలీలో "మాయావతి ఎవరైనా అత్యాచారం చేయాలనుకునేలా అంత అందంగా ఉంటారా?" అన్నారు.
అంటే అందంగా ఉన్న మహిళలపైనే అత్యాచారం జరుగుతుందా? మహిళ అత్యాచారానికి గురికావడానికి ఆమె అందమే కారణం అవుతుందా?
మరికొందరు నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ వాటిని మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మాయావతిపై మహిళలే కాదు, పురుషులు కూడా సెక్సిస్ట్ కామెంట్లు చేశారనేది మనం తెలుసుకుంటే చాలు.
ఇలాంటి వ్యాఖ్యలు మహిళలను సంప్రదాయ భావజాలం కంటే ముందుకు తీసుకెళ్తాయి.

ఫొటో సోర్స్, FACEBOOK / SADHANABJP
మహిళకు, మహిళే వ్యతిరేకం ఎందుకు?
కానీ చుట్టు తిరిగి ఆ ప్రశ్న మళ్లీ మొదటికే వస్తుంది. ఒక మహిళ, మహిళకు వ్యతిరేకంగా అలా ఎందుకు మాట్లాడింది?
దానికి సమాధానం కూడా అంత కష్టమైనదేం కాదు.
తమ పెంపకం, పురాతన ఆలోచనల వల్లే ములాయం సింగ్ యాదవ్, మిగతా పురుషులంతా ఇలా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మహిళలు కూడా అలాంటి రాజకీయ వాతావరణంలో జీవిస్తున్నారు.
పురుషాధిక్యత ఉండే సమాజంలో, మహిళలను, ముఖ్యంగా దళిత మహిళలను తక్కువ దృష్టితో చూస్తున్నారు.
సాధనా సింగ్ మాయావతి బట్టలు చిరగడం వల్ల ఆమెను కళంకితురాలైందని చెప్పినప్పుడు ఆ మాటల వెనుక తన ఉద్దేశం బహుశా అత్యాచారానికి గురైన మహిళ శాశ్వతంగా కళంకిత అవుతుందనేదేనని చెప్పాలనుకున్నానని అనుకుని ఉండరు.
లేదా 2014లో బీజేపీ ప్రతినిధి షాయనా ఎన్.సి. జైపూర్‌లో ఒక సమావేశంలో మాయావతి 'హీ'నా 'షీ'నా తనకు అర్థం కావడం లేదన్నారు.
ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షాయినా మాయావతి బట్టలు, హెయిర్ స్టైల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఒక మహిళ అంటే ఒక విధమైన వస్త్రధారణ, అలంకరణ అవసరం అనేది ఆమె ఉద్దేశం అనిపిస్తుంది.
అంటే వామపక్ష నేత కవితా కృష్ణన్ "అధికారం అనేది పురుషుల అధికార పరిధి. మాయావతి వివాహిత కాదు, ఆమెకు పొట్టి జుట్టుంది. చీర కట్టుకోదు, అందుకే ఆమె 'ఉమెన్లీ ఉమెన్' అని కూడా అర్థం" అన్నారు.

ఫొటో సోర్స్, Pti
జాతి, వర్గం
పురుషులు, మహిళల సెక్సిస్ట్ వ్యాఖ్యలకు బలైన మహిళా నేతల్లో మాయావతి మాత్రమే లేరు.
కానీ ఆమె దళితురాలు కావడం వల్ల ఆమె ఎంపీ, ముఖ్యమంత్రి పదవుల వరకూ చేరినా జాతి, కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
జర్నలిస్ట్ అజయ్ బోస్ ఆమె జీవితంపై రాసిన తన 'బెహెన్‌జీ: ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ మాయావతి' పుస్తకంలో దీని గురించి చాలా ప్రస్తావించారు.
పార్లమెంటులో ఒక మహిళా నేత మాయావతి జుట్టుకు నూనె పెట్టుకుని రావడం చూసి నవ్వేవారు. మాయావతికి చాలా చెమట పడుతుందని, ఘాటుగా ఉండే పెర్‌ఫ్యూమ్ వాడాలని ఫిర్యాదు కూడా చేశారు.
కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషీ 2009లో ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి నుంచి అత్యాచార బాధితులకు పరిహారం మొత్తం పెంచడం గురించి ఆమెను విమర్శించారు. "ఆ పరిహారం మొత్తాన్ని ఆమెపైనే విసిరి, మీరు అత్యాచారానికి ఒప్పుకుంటే, నీకు ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి" అన్నారు.
అంటే నేను ముందే అన్నట్టు ఒక్కో మాట అంతకు ముందు వ్యాఖ్యను మించినట్టు ఉంటుంది.
ఇది మహిళ-పురుషుల మధ్య పోటీ గురించి కాదు, మన రాజకీయాలు, మన సమాజం గురించి. మహిళే మహిళకు వ్యతిరేకం అనే ఈ మాటను ఇంకా ఎంతకాలం సమర్థించుకుంటూ రావాలి?
రాజకీయాల్లో మన నేతలందరూ మారాల్సి ఉంటుంది. పెంపకం, సంప్రదాయ ఆలోచనలు వదిలిపెట్టి మహిళలు, తక్కువ కులంగా భావించే వారిపై సమానత్వం, గౌరవం, సున్నితత్వం చూపించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మాయావతి ఇప్పటికీ మర్చిపోలేని ఘటన: గెస్ట్‌హౌస్‌లో ఆరోజు ఏం జరిగింది?
- అరకు బెలూన్ ఫెస్ట్ : ఒక్కో బెలూన్ ఖరీదు రూ.1.5 కోట్లు
- 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో బీసీ కోటా ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేరు
- చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది
- మీరు రిస్కీ నిర్ణయాలు తీసుకోవటానికి కారణాలేమిటి
- అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నోళ్లు ‘100 ఏళ్లు బతుకుతున్నారు’
- కాపుల రిజర్వేషన్.. ఎన్ని మలుపులు తిరిగింది, ఇప్పుడెక్కడుంది
- విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట.. ఎవరికీ సాధ్యం కానిది కోహ్లీకే సాధ్యమైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








