పీవీ సింధు: ఫైనల్ ఫోబియాపై ఏమన్నారు? - BBC Telugu Exclusive Interview

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రిపోర్టర్: బళ్ల సతీశ్; షూట్-ఎడిట్: నవీన్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కొత్త సంవత్సరం 2019లో తనలో కొత్త సింధును చూస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు చెప్పారు.
ఇటీవల చైనాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజయం సాధించిన సింధు తాజాగా బీబీసీ తెలుగుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణి సింధునే. 2017లో ఈ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచారు.
వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజయం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని సింధు చెప్పారు.
ఫైనల్‌కు చేరుకున్న తర్వాత సింధు ఫోబియా వల్ల ఓడిపోతోందని, రజతంతో సరిపెట్టుకుంటోందనే వ్యాఖ్యలు ఇంతకుముందు వినిపించాయని ఆమె ప్రస్తావించారు. 2018లో నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోయానన్నారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ గెలవడం, అదీ సంవత్సరం చివర్లో గెలవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. ఇది గుర్తుండిపోయే టోర్నీ అని తెలిపారు.
ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తాను ముందుకు వెళ్లాలనుకొంటున్నానని సింధు చెప్పారు. కొత్త సంవత్సరంలో తనలో కచ్చితంగా చాలా మార్పు ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, www.pbl-india.com
'పీబీఎల్ ఉత్తేజకరమైన టోర్నీ'
ప్రీమియర్ బ్యాడ్యింటన్ లీగ్(పీబీఎల్) చాలా ఉత్తేజకరమైన టోర్నీ అని సింధు తెలిపారు. ప్రస్తుత పీబీఎల్ సీజన్ 4లో తాను హైదరాబాద్ హంటర్స్ జట్టుకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, సొంత గడ్డపై ఆడుతుండటం తనకెంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.
హైదరాబాద్ హంటర్స్ జట్టులో క్రీడాకారులందరూ స్నేహపూర్వకంగా ఉంటారని, ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారని, ఇది చాలా మంచి విషయమని చెబుతూ సింధు సంతోషం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- అమరావతి ఫార్ములా వన్ రేసింగ్: విజేత అబుదాబి జట్టు
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’
- సైనా-సింధు: ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









