విరాట్ కోహ్లి: వన్డేల్లో శరవేగంగా 10 వేల పరుగులతో కొత్త రికార్డ్

కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మైలు రాయిని అందుకున్నాడు.

అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

పదివేలకు 81 పరుగుల దూరంలో ఉండగా విరాట్ విశాఖలో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

అంతకు ముందు 212 వన్డేల్లో 58.69 సగటుతో 9,919 పరుగులు చేశాడు.

వీటిలో 36 శతకాలు ఉన్నాయి.

తాజా మ్యాచ్‌లోనూ విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత్ ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా ఏడు వికెట్లు నష్టపోయి ఇవే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

అయిదు మ్యాచ్‌ల సీరీస్‌లో 1-0 తో భారత్ ముందంజలో ఉంది.

వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్

1. విరాట్ కోహ్లి - 213 మ్యాచ్‌లు

2. సచిన్ తెందూల్కర్ - 266 మ్యాచ్‌లు

3. సౌరవ్ గంగూలి - 272 మ్యాచ్‌లు

4. రికీ పాంటింగ్ - 272 మ్యాచ్‌‌లు

5. జాక్వెస్ కలిస్ - 286 మ్యాచ్‌లు

పదివేల పరుగుల ఘనతను సచిన్ 266 మ్యాచ్‌లలో సాధించగా.. విరాట్ 213 మ్యాచుల్లోనే సాధించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)