పృథ్వీ షా: చిన్న వయసులో, తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ కొట్టిన భారత ఆటగాడు

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

పృథ్వీ షా మొదటి టెస్టులో బరిలోకి దిగక ముందే అందరినీ ఆకర్షించాడు. తనలో అంత ప్రత్యేకత ఏముందో తొలి ఇన్నింగ్స్‌‌లోనే చూపించాడు.

రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న షా తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో రికార్డ్ సృష్టించాడు.

వన్డేను తలపించేలా..

నింపాదిగా ఆడే టెస్ట్ మ్యాచ్‌లో షా దూకుడుగా ఆడాడు. 98 బంతుల్లో 15 ఫోర్లతో తొలి సెంచరీ నమోదు చేశాడు.

తన ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన సహచరుడు అజింక్య రహానే, కోచ్ రవిశాస్త్రి సలహాలను తూచతప్పక పాటిస్తూ తన స్టైల్ ఆటను షా చూపెట్టాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

ఆరంభంలోనే అదరగొట్టాడు

టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా దిగిన పృథ్వీ షా బ్యాటింగ్ శైలి చూసిన ప్రతి ఒక్కరికీ ఒకటే అనిపించింది. కేవలం 18 ఏళ్ల ఈ క్రికెటర్‌కు ఇది అరంగేట్రంలా (మొదటి టెస్టులా ) అసలు ఎవరికీ అనిపించలేదు.

కేవలం 56 బంతుల్లో అర్థ శతకం, 98 బంతుల్లో సెంచరీ చేసిన పృథ్వీ షా కెరీర్లో మొదటి టెస్టు మ్యాచ్‌లోనే రికార్డులు నమోదు చేశాడు.

కెరీర్ మొదటి టెస్టులోనే అర్థ శతకం, శతకం చేసిన పిన్న వయసు భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అంతే కాదు, భారత క్రికెట్లో సెంచరీ చేసిన రెండో అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

18 ఏళ్ల 329 రోజుల వయసులో సెంచరీ చేసిన పృథ్వీ కంటే ముందు సచిన్ ఆ రికార్డ్ సాధించాడు. 17 ఏళ్ల 107 రోజుల వయసులో సచిన్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.

మొదటి టెస్టులో సెంచరీ చేసిన వారిలో పృథ్వీ షా ప్రపంచంలో 104వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు, 15వ భారత క్రికెటర్ అయ్యాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, FACEBOOK.COM/CRICKETWORLDCUP

పృథ్వీ షా-పరిచయం

పృథ్వీ షా సెంచరీల జోరు 14 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది.

'కంగా' లీగ్‌లో 'ఎ' డివిజన్లో సెంచరీ చేసిన పృథ్వీ ఆ లీగ్‌లో సెంచరీ చేసిన వారిలో అందరికంటే చిన్నవాడుగా నిలిచాడు.

2014 డిసెంబర్‌లో స్కూల్ తరఫున ఆడిన పృథ్వీ షా 546 పరుగుల రికార్డు కూడా సృష్టించాడు.

పృథ్వీ షా ముంబై అండర్-16 జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

న్యూజీలాండ్‌లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌ టోర్నమెంటులో టీంఇండియా కెప్టెన్‌గా జట్టును విజేతగా నిలిపాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Pti

ఐపీఎల్‌లో పృథ్వీ షా రికార్డ్

2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో దిల్లీ డేర్ డెవిల్స్ పృథ్వీ షాను 1.2 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.

పృథ్వీ షా 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌'తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌తో ఐపీఎల్ ఆడిన చిన్న వయసు (18 ఏళ్ల 165 రోజులు) క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.

మొదటి మ్యాచ్‌లోనే 10 బంతులకు 22 పరుగులు చేసిన పృథ్వీ షా, ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు. 27.22 యావరేజితో మొత్తం 245 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో పృథ్వీ 153.1 స్ట్రయిక్ రేట్ సాధించాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Pti

రంజీ ట్రోఫీలో పృథ్వీ షా

గత రెండు దశాబ్దాల్లో రంజీట్రోఫీలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా పృథ్వీ షా రికార్డు సృష్టించాడు.

దులీప్ ట్రోఫీలో కూడా మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి సత్తా చాటాడు.

2017-18 రంజీ ట్రోఫీలో పృథ్వీ షా చెలరేగిపోయాడు. తమిళనాడు(123), ఒడిషా(105), ఆంధ్రప్రదేశ్(114)పై వరస సెంచరీలు చేశాడు.

పృథ్వీ షా టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టక ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 15 మ్యాచ్‌ల్లో 57.44 సగటుతో 1,436 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు ఉన్నాయి.

ఇక ఇంగ్లండ్‌లో భారత్ 'ఎ' జట్టు కోసం ఆడిన పృథ్వీ షా 60.3 సగటుతో అత్యధికంగా 603 పరుగులు చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో కూడా పృథ్వీ షా చివరి రెండు మ్యాచ్‌ల కోసం ఎంపికయ్యాడు. కానీ, తుది జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, PTI

పృథ్వీ షాపై ప్రశంసలు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన పృథ్వీ షాపై భారత క్రికెట్ అభిమానులు, ఇతర క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఇది ప్రారంభమే, ఈ కుర్రాడిలో చాలా దమ్ముంది" అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇక వీవీఎస్ లక్ష్మణ్ "18 ఏళ్ల యువకుడు మైదానంలో దిగగానే, తన నేచురల్ గేమ్ ఆడడం చూస్తుంటే, చాలా బాగుంది" అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)