క్రికెట్: బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ యువకుడు

ఫొటో సోర్స్, SHO, BanjaraHills
లాయిడ్ ఆంథోనీ అనే పాతికేళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని, ఆంథోనీ తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు.
వారందించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జహీరనగర్‌లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అందులో ఆంథోనీ బౌలింగ్‌కు వచ్చారు.
మూడు బంతుల్ని వేసిన అతను ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చక్కగా బౌలింగ్ చేస్తున్నావంటూ సహచర క్రికెటర్లు అతన్ని అభినందించటం వీడియోలో వినిపిస్తోంది.
అయితే, నాలుగో బంతిని విసిరేందుకు రెండడుగులు వేసిన ఆంథోనీ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు.

ఫొటో సోర్స్, SHO, BanjaraHills
ఏం జరిగిందో అర్థంకాని మిగతా క్రికెటర్లంతా అతని వద్దకు వెళ్లారు. అయితే, ఆంథోనీ చుట్టూ గుమి కూడవద్దని, గాలి ఆడేలా చూడాలని మైక్‌లో అనౌన్స్ చేస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది.
సహచర క్రికెటర్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారని, ఆస్పత్రికి వచ్చేప్పటికే ఆంథోనీ గుండెపోటుతో మరణించారని డాక్టర్లు ధృవీకరించినట్లు పోలీసులు చెప్పారు.
ఆంథోనీ ఏడేళ్లుగా క్రికెట్ ఆడుతున్నారని, ప్రతి వారం కనీసం నాలుగు గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారని ఆంథోనీ స్నేహితుడు రాజు బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్‌కు తెలిపారు.
ఆంథోనీ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండేవారు. జహీరనగర్‌లో గత పదేళ్లుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోందని రాజు వెల్లడించారు. ఆంథోనీకి అంతకు ముందు మరే ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- ఆటోడ్రైవర్ కొడుకు టీ20కి ఎంపిక
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్‌స్టార్
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- విరాట్ కోహ్లీ: అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
- ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు
- మిథాలీ మా మోడల్ అంటున్న హైదరాబాదీ అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









