నోబెల్: రసాయన శాస్త్రంలో ఎంజైముల సృష్టికి పురస్కారం

ఫొటో సోర్స్, The Nobel Prize/Twitter
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తాజాగా ప్రకటించారు. ఎంజైములకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది.
అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ పి స్మిత్‌లతోపాటు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్ ఈ జాబితాలో ఉన్నారు.
కొత్త ఎంజైములను సృష్టించేందుకు వీరు 'డైరెక్టెడ్ ఎవల్యూషన్' అనే పద్ధతిని ఉపయోగించారు. జీవశాస్త్రంలో రసాయనిక చర్యలు వేగంగా జరిగేందుకు వీరి పరిశోధనలు తోడ్పడతాయి. కొత్త ఔషధాలు తయారు చేయడంతోపాటు, పర్యావరణహిత ఇంధనాలు ఉత్పత్తి చేసేందుకు వీరు సృష్టించిన కొత్త ఎంజైములు ఉపయోగపడతాయి.
బహుమతి మొత్తం 9,98,618 డాలర్లు. ఇందులో సగం ఆర్నాల్డ్‌కు దక్కనుండగా, మిగతా సగాన్ని స్మిత్, వింటర్ పంచుకోనున్నారు.

ఫొటో సోర్స్, GAVIN MURPHY/NATURE/SCIENCE PHOTO LIBRARY
రసాయన శాస్త్రంలో గత నోబెల్ విజేతలు:
2017: జీవ అణువుల అభివృద్ధి, ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే తీరు వంటి వాటిని చూడగల 'క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ' అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు జాక్వస్ డబోషెట్, జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు నోబెల్ లభించింది.
2016: ప్రపంచంలోనే అతి చిన్న యంత్రాన్ని తయారు చేసిన జీన్ పియెర్రా సావేజ్, ఫ్రేజర్ స్టాడర్ట్, బెర్నార్డ్ ఫెరింగాలకు నోబెల్ లభించింది. ఈ అతి చిన్న యంత్రాలు మానవుని శరీరంలోకి ఔషధాలను తీసుకుని వెళ్తాయి.
2015: దెబ్బతిన్న డీఎన్‌ఏను శరీరం కణాల ద్వారా సరి చేసే విధానాన్ని కనుగొన్న థామస్ లిండా, పాల్ మోడ్రిచ్, అజీజ్ సన్కార్‌లను నోబెల్ వరించింది.
ఇవి కూడా చదవండి:
- BBC News తెలుగు: ఒక ఏడాది.. కొన్ని అనుభవాలు
- విప్లవాత్మక క్యాన్సర్ చికిత్స విధానం కనుగొన్న శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్ బహుమతి
- 55 ఏళ్ల తర్వాత భౌతిక శాస్త్రంలో మహిళకు నోబెల్ ప్రైజ్
- నల్లడబ్బు స్విస్ బ్యాంకులకు ఎలా తరలిపోతోంది?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- బిగ్ బాస్-2: ’’ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది‘‘- బాబు గోగినేని
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- ‘‘అత్యాచారం వ్యధ నుంచి నేనెలా కోలుకున్నానంటే...’’
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








