ఆసియా కప్: భారత్-అఫ్గాన్ మ్యాచ్ తరువాత ధోనీకి కోపం వచ్చిందా?

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్ ఫలితం వల్ల టీమిండియాపై ఎలాంటి ప్రభావం పడదు. అయినా, భారత్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది.
దానికి ఒక కారణం ఉంది. అఫ్గానిస్తాన్ అప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినా.. వారి ఆటతీరు అందరినీ ఆకర్షించింది. మరోవైపు భారతీయ జట్టులోని ప్రముఖ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
అందుకే, ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మెరుగైన ఆట ప్రదర్శిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సీనియర్ ఆటగాళ్ళు లేకుండా బరిలోకి దిగిన భారతీయ జట్టును ఆ టీమ్ ఎదుర్కోగలదా అనుకున్నారు. అక్కడ అదే జరిగింది.
అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగానే అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. కానీ మొహమ్మద్ షహజాద్ అద్భుత సెంచరీతో కెప్టెన్‌గా తన నిర్ణయం సరైనదే అని నిరూపించాడు. భారత జట్టుకు సవాలు విసిరేలా ఆ టీమ్ 252 పరుగుల స్కోరు కూడా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ ఎలా టై అయ్యింది?
అఫ్గానిస్తాన్ నిర్దేశించిన లక్ష్యానికి సమాధానంగా భారత్‌కు మంచి ప్రారంభమే లభించింది. అయితే, ఓపెనర్లు ఇద్దరి పార్టనర్‌షిప్ తర్వాత మరో సుదీర్ఘ భాగస్వామ్యం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో రవీంద్ర జడేజా అత్యుత్సాహంతో కొట్టిన షాట్ టీమిండియాను 252 పరుగులకే పరిమితం చేసింది. మ్యాచ్ టైగా ముగిసింది.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన కెప్టెన్ ధోనీ అఫ్గానిస్తాన్‌ను ఆకాశానికెత్తేశాడు. "నాకు ఈ జట్టు క్రికెట్ చాలా మెరుగైందని అనిపిస్తోంది. ఆసియా కప్ ప్రారంభం నుంచి వారు బాగా ఆడారు. అప్ఘానిస్తాన్ తమ ఆటను అద్భుతంగా మెరుగు పరుచుకున్న జట్టుగా నిలుస్తుంది" అన్నాడు.
"అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చాలా బాగుంది. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు, బౌలింగ్ కూడా టైట్‌గా ఉంది" అన్నాడు ధోనీ.
శిఖర్ ధవన్, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్లకు, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ ప్రభావం భారత జట్టుపై చాలా స్పష్టంగా కనిపించింది.
ధోనీ ఇంకేం చెప్పాడు?
"దీన్ని మేం మా పూర్తి బలంతో ప్రారంభించలేదు. చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చాం. బంతి స్వింగ్ కానప్పుడు, ఫాస్ట్ బౌలర్లు లెంత్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలా మేం 5-6 ఓవర్లు నష్టపోయాం" అని ధోనీ చెప్పాడు.
"కొంతమంది రనౌట్ కూడా అయ్యారు. అవి కాకుండా వేరే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నేను ప్రస్తావించాలని అనుకోవడం లేదు. జరిమానా కట్టడం నాకు ఇష్టం లేదు. ఫలితం చూస్తే టై అనేది అంత తక్కువేం కాదు. మేం ఓడిపోయి కూడా ఉండవచ్చు" అని ధోనీ అన్నాడు.
ఇంతకీ, ధోనీ ఏయే విషయాలను ప్రస్తావించదలచుకోలేదని అన్నాడు? ఏ విషయాలు మాట్లాడితే జరిమానా కట్టాల్సి వస్తుందని భావించాడు? అంపైర్ నిర్ణయాల గురించే అతను అలా అన్నట్టు తెలుస్తోంది. వాటిలో మహి ఎల్‌బీడబ్ల్యు కూడా ఉంది. కానీ, అంపైరింగ్‌తో పాటు కెఎల్ రాహుల్ నిర్ణయం కూడా అతడికి బాధ కలిగించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కెఎల్ రాహుల్ పొరపాటు దెబ్బ కొట్టిందా?
26వ ఓవర్లో జావేద్ అహ్మదీ వేసిన ఐదో బంతికి ధోనీ ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. బంతి తన ప్యాడ్‌కు తగలగానే అంపైర్ వేలెత్తేశాడు. దాంతో ధోనీ బాధగా పెలివియన్ దారి పట్టాల్సి వచ్చింది.
రీప్లేలో ధోనీ బాధకు కారణం ఏంటో తెలిసింది. బంతి ఆఫ్ స్టంప్‌పై తన ప్యాడ్‌కు తగిలింది. ఆ టైంలో తను షాట్ కొట్టడానికి కాలు కూడా బయటకు పెట్టాడు. టర్న్ అయిన బంతి లెగ్ స్టంప్ నుంచి బయటికి వెళ్తున్నట్టు కూడా కనిపించింది.
కానీ, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి ధోనీకి DRS (అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే విధానం - డిసెషన్ రివ్యూ సిస్టమ్) ఆప్షన్ లేకుండా పోయింది. దానిని అప్పటికే ఓపెనర్ కెఎల్ రాహుల్ వాడేశాడు.
21వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్ ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ దినేష్ కార్తీక్‌తో చర్చించిన తర్వాత రాహుల్ DRS తీసుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ధోనీ అభిమానుల ఆగ్రహం
కానీ, రీప్లేలో అవుట్ అయినట్లు స్పష్టంగా తేలడంతో రాహుల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. రాహుల్ DRS తీసుకోకుండా ఉంటే, ధోనీకి DRS ప్రత్యామ్నాయం ఉండేది. అంపైర్ నిర్ణయాన్ని తప్పని నిరూపించే అవకాశం లభించేది.
సోషల్ మీడియాలో ధోనీ అభిమానులు ఇదే విషయంపై పోస్టులు పెడుతున్నారు. సర్ జడేజా అనే హ్యాండిల్లో "కెఎల్ రాహుల్ రివ్యూ అడగకుంటే, ధోనీ నాటవుట్ అయ్యేవాడు, క్రీజులోనే నిలిచేవాడు" అని ట్వీట్ చేశారు.
దీపక్ రాజ్ వర్మ అనే మరో హ్యాండిల్ "ఎంఎస్ ధోనీ అవుట్ కాలేదు, కానీ, రాహుల్ రివ్యూ వాడేయడం వల్ల, అతడు పెవిలియన్ చేరాల్సి వచ్చింది" అని పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- లాల్ బహుదూర్ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా?
- ఆధార్‌పై సుప్రీం కోర్టు తీర్పు: బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం వద్దు
- బీబీసీ పరిశోధన: కెమరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే..
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు.. 32 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నాను
- బిహారీ హంతకులకు ఏకే-47 గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఓషో పాత్రలో ఆమిర్ ఖాన్... ఆనంద్ షీలాగా ఆలియా భట్
- అగరుబత్తీ - సిగరెట్: ఏ పొగ ఎక్కువ ప్రమాదకరం?
- సిక్కిం: సుందర పర్వత సీమల్లో అద్భుత విమానాశ్రయం
- పోర్చుగల్: సముద్ర గర్భంలో బయటపడ్డ 400 ఏళ్లనాటి ఓడ శకలాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








