రూపాయి పతనం: సామాన్యుడు ఆర్బీఐ నుంచి ఏం ఆశించవచ్చు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ కరెన్సీ(రూపాయి) పతనం కొనసాగిన తర్వాత బుధవారం ఒక అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 72.88 రూపాయలకు చేరుకుంది.
అమెరికా డాలర్‌తో ఇప్పటివరకూ రూపాయి అతి తక్కువ ఎక్స్చేంజ్ రేటు ఇదే.
రూపాయి విలువ పడిపోవడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శిస్తోంది.
అటు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూపాయి పతనం వెనుక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని చెప్పారు.
రూపాయి పతనం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి పరిష్కారం ఎందుకు వెతకడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు బీబీసీ సీనియర్ ఆర్థికవేత్త ఇలా పట్నాయక్‌తో మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
1.భారతీయ కరెన్సీ పతనం కొనసాగడానికి కారణం ఏంటి?
"భారతీయ కరెన్సీలో రూపాయి ప్రస్తుతం చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లే ఎక్కువ, ఆర్థికంగా అభివృద్ధి చెందే దేశాల కరెన్సీ ఒత్తిళ్లకు గురి అవుతోంది. కొన్ని దేశాలు దానితో పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మనం దాన్ని ఎదుర్కోవడానికి పెద్దగా ప్రయత్నించడం లేదు" అన్నారు ఇలా పట్నాయక్.
"చమురు ధరల్లో వృద్ధి వచ్చింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులో వృద్ధి ఉంది. అమెరికా ప్రభుత్వం నుంచి రుణం తీసుకునే రేటు పెరగడం వల్ల కూడా ప్రమాదకరమైన స్థితి ఏర్పడింది. దానివల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కరెన్సీ పడిపోవడం కనిపిస్తోంది. భారతీయ కరెన్సీ గత కొన్ని రోజుల నుంచీ చాలా నియంత్రణలో ఉండేది, దానివల్ల కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్‌లో మార్పు వస్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఈ పతనం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
2.ఆర్బీఐ కరెన్సీ పతనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు?
అమెరికా వడ్డీ రేటు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని మార్కెట్లలో కరెన్సీ పతనం కావడం మనం చూస్తున్నాం. టర్కీ కరెన్సీ లీరా దీనికి ఒక ఉదాహరణ. ఇటీవల కొన్ని రోజులు మనం దాని చారిత్రక పతనం చూశాం. అప్పటి నుంచి ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు టర్కీ పరిష్కారాలు వెతుకుతోంది.
అలాటప్పుడు, రూపాయి పతనం కొనసాగుతున్నా భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ దానిని ఎందుకు పరిష్కరించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ప్రశ్నకు జవాబిచ్చిన పట్నాయక్.. "భారత్‌లో ఇన్‌ఫ్లేషన్ రేట్ అమెరికా ఇన్‌ఫ్లేషన్ రేటు కంటే ఎక్కువ. అలాంటప్పుడు మన కరెన్సీ గత మూడు, నాలుగేళ్లలోనే పడిపోయి ఉండాలి. కానీ కేపిటల్ ఫ్లో ఉన్నప్పుడు, కరెన్సీ సమన్వయం ఎప్పుడూ దాని ప్రాథమిక సిద్ధాంతాల నుంచి విడిపోతుంది.
"అలాంటప్పుడు మనం ఆ సమన్వయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మన కరెన్సీని ఎక్కువ బలోపేతం చేయవచ్చు. దానివల్ల మన ఎగుమతులకు, పరిశ్రమలకే నష్టం వస్తుంది. మన దేశీయ వ్యాపారంపై ప్రభావం పడుతుంది. అది పోటీ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే మనం దిగుమతులు చౌకగా ఉంచుతాం.
ఇలాంటి సమయంలో మన కరెన్సీలో సరైన సమన్వయం లేకుంటే, అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు".
"మన కరెన్సీలో పతనం వస్తుంటే, అది మంచిదే. ఎందుకంటే రూపాయి పడిపోయినప్పుడు అది బలోపేతం అవుతుంది. అలాంటప్పుడు అంతర్గత, బయట కారణాల వల్ల కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేటులో మార్పు వస్తే దాన్ని అలా జరగనివ్వాలి. ఇక ఆర్బీఐ బాధ్యతల విషయానికి వస్తే, పార్లమెంటు ఆర్బీఐకి ద్రవ్యోల్బణం అడ్డుకునే పని అప్పగించింది" అన్నారు పట్నాయక్.

ఫొటో సోర్స్, Getty Images
3.ఆర్బీఐ రూపాయి పతనాన్ని అడ్డుకుంటే ఏమవుతుంది?
కాంగ్రెస్, బీజేపీ రెండూ ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు రూపాయి పతనానికి అధికార పార్టీల పనికిమాలిన ఆర్థిక విధానాలే కారణం అని ఆరోపిస్తూ వచ్చాయి.
అలాంటప్పుడు ఆర్బీఐ రాజకీయ ఒత్తిడులకు తలవొగ్గి కరెన్సీ పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?
దానికి సమాధానంగా "ఒత్తిళ్ల వల్ల ఆర్బీఐ ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే, అది వడ్డీ రేట్లు పెంచగలదు. ఎందుకంటే రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి ఉన్న ఒకే ఒక దారి అది మాత్రమే. బ్యాంక్ ఆఫ్ ఇండోనేసియా కూడా అలాగే చేసింది. అక్కడ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆర్బీఐ కూడా అలాగే చేస్తే, దేశంలోని పారిశ్రామిక రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది" అన్నారు పట్నాయక్.

ఫొటో సోర్స్, Getty Images
4.ఒక సామాన్యుడు ఆర్బీఐ నుంచి ఏం ఆశించవచ్చు?
భారతదేశంలో సామాన్యుడు రూపాయి పతనాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి సంకేతంగా భావిస్తాడు.
ఆర్బీఐపై సామాన్యుడి ఆశల గురించి మాట్లాడిన పట్నాయక్ "ప్రజలను భయపెట్టేలా ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలనే కోరుకోవాలి. ఎందుకంటే ఒత్తిళ్లకు గురై అది వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెడితే, 2013లో లాగే వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, పెట్టుబడులు తగ్గిపోవడం, క్రెడిట్ గ్రోత్ తగ్గడం, ఉపాధి రేటు కూడా తగ్గిపోవడం లాంటివి మళ్లీ వస్తాయి. సామాన్యుడికి ఇప్పుడు జరిగేదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది" అన్నారు.
"డాలరుతో పోలిస్తే రూపాయి 72 లేదా 73 స్థాయిలో ఉన్నప్పుడు, చమురు ధరలు, మొబైల్ ధరలు పెరగడం వల్ల సామాన్యుడికి అంత తేడా అనిపించదు. కానీ, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరిగినా, బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ తగ్గినా, ఉపాధి తగ్గినా, వాటి వల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది" అని ఇలా పట్నాయక్ తెలిపారు.


ఇవికూడా చదవండి:
- ఆ ఊళ్లో బతకాలంటే ఆపరేషన్ తప్పనిసరి
- అడవి బిడ్డల ప్రసవ వేదన.. మాతాశిశు మరణయాతన
- అమ్మానాన్నలు కావాలన్న వీళ్ల ఆశలు ఫలిస్తాయా?
- నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- ‘నా కుమారుడు స్వలింగ సంపర్కుడు.. అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
- అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు
- ‘భాగస్వామిని ఆకట్టుకునే శృంగార కళను మర్చిపోతున్న భారతీయులు’
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- ఎవరు అబద్ధాల కోరు?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








