'పోర్న్ కిప్ల్‌కి నా ముఖాన్ని పెట్టారు’’.. జర్నలిస్టు ఆవేదన

rana

ఫొటో సోర్స్, Twitter

భారత్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు రానా ఆయూబ్ రాసినట్టుగా ఉన్న ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో తీవ్రమైన వేధింపులు ఎదురవుతున్నాయి.

కానీ అది ఫేక్ ట్వీట్. రానా అయూబ్ రాసింది కాదు.

అయినా తనను తీవ్ర పదజాలంతో తిడుతూ కామెంట్లు, మెసేజ్‌లు చేస్తున్నారని ఆమె తెలిపారు.

పోర్న్ వీడియో క్లిప్పులకు తన ఫొటోను అతికించి వాట్సాప్ నంబర్‌కు పంపుతున్నారని రానా ఆయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెపై చాలాకాలంగా జరుగుతున్న ఈ దాడిపట్ల ఐక్యరాజ్య సమితి స్పందించింది.

రానాకు సరైన రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

ప్రస్తుతం తన పరిస్థితి ఎలా మారిందో ఆమె బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరీరాకు వివరించారు.

మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

వీడియో క్యాప్షన్, 'పోర్న్ వీడియోలో నా ముఖాన్ని పెట్టారు'

వీడియో గ్రాఫిక్స్: నికితా దేశ్‌పాండే, పునీత్ బర్నాలా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)