భిన్నత్వమే భారతీయతకు పునాది.. అసహనం దాన్ని దెబ్బతీస్తుంది - ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ

ఫొటో సోర్స్, SANJAY TIWARI
నాగ్‌పూర్‌లోని రేషీమ్‌బాగ్ మైదానంలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శిక్షా వర్గ్ మూడో వార్షిక కార్యక్రమం ముగింపు ఉత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయవాదం గురించి ప్రసంగించారు.
మోహన్ భాగవత్, ప్రణబ్ ముఖర్జీల ప్రసంగ వీడియోను ఇక్కడ చూడండి..
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- జాతి, జాతీయవాదం, దేశభక్తి గురించి నా అభిప్రాయాలను పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. మనది వసుధైక కుటుంబ భావన. భారత జాతీయవాదం యూరప్ జాతీయవాదానికి పూర్తిగా విరుద్ధమైనది.
- మతం, ప్రాంతం, ద్వేషం, అసహనం మన జాతీయ గుర్తింపును పక్కదారి పట్టిస్తాయి.
- ప్రాతీయంగా ఏకాకుల్ని చేయటం, రాజకీయంగా ఆధిపత్యాన్ని చెలాయించటం కంటే ప్రాథమిక ఏకత్వం చాలా గొప్పది, లోతైనది అని చరిత్ర కారుడు విన్సెంట్ స్మిత్ చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి.
- ఎంతో మంది భారత్‌పై దండయాత్రలు చేసినప్పటికీ 5 వేళ్ల భారతీయ జీవనం మాత్రం చెక్కు చెదరలేదు.
- హిందు, ముస్లిం, సిక్కు ఇతర సంస్కృతుల సైద్ధాంతిక వైరుద్ధ్యం నుంచే జాతీయ వాదం పుట్టుకొస్తుంది అని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారు. జాతీయవాదం గురించి బాలగంగాధర తిలక్, మహాత్మాంగాంధీ కూడా తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
- భారతదేశం ప్రపంచంలోనే వృద్ధి చెందుతున్న దేశమని ప్రపంచ వ్యాప్తంగా చాలా సూచీలు చెబుతున్నాయి. అయితే, మన దేశం సంతోషంగా లేదని ప్రపంచ సంతోష సూచీ చెబుతోంది.
- పార్లమెంటుకు వెళుతుంటే 6వ గేటు వద్ద సంస్కృతంలో ఇలా రాసి ఉంటుంది.. ‘‘ప్రజల ఆనందంలోనే రాజు ఆనందం దాగి ఉంటుంది. వారి సంక్షేమంలోనే రాజు సంక్షేమం ఉంటుంది’’ అని కౌటిల్యుడు చెప్పాడు.
- మన ఆర్థిక వృద్ధిని నిజమైన అభివృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. శాంతి, సౌభ్రాతృత్వం, సంతోషాలను వ్యాపింపచేయాలి. ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయాలి, ప్రజల రోజువారీ జీవితాలను మార్గనిర్దేశం చేయాలి. తద్వారానే సంతోషకరమైన దేశం ఏర్పడుతుంది.. అక్కడే జాతీయవాదం ఎలాంటి అవరోధాల్లేకుండా, తనంతతానుగా ప్రవహిస్తుంది.
- సర్ సంచాలక్ మోహన్ భాగవత్ నన్ను క్షమించాలి. ఎందుకంటే మీరు కోరుకున్న సమయంలోపు నేను నా ప్రసంగాన్ని ముగించలేకపోయాను. ధన్యవాదాలు. జైహింద్. వందేమాతరం.

ఫొటో సోర్స్, @RSS
మోహన్ భాగవత్ ప్రసంగంలో ముఖ్యాశాలు..
- ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోని ప్రముఖులను దీనికి ముఖ్యఅతిథులుగా ఆహ్వానిస్తాం. వీలున్నవారు వస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతోందో చూస్తారు. ఈరోజు దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా చర్చ జరుగుతోంది. అయితే, ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఎలా జరుగుతోందో.. ఇప్పుడూ అలాగే జరుగుతోంది.
- ప్రణబ్ ముఖర్జీ మాకు ముందు నుంచీ తెలుసు. చాలా జ్ఞాన సంపన్నులు ఆయన. సహజంగానే ఆయన్ను ఆహ్వానించాం. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించారు. ఇది చాలా సర్వసాధారణం. ఆయన్ను ఎందుకు పిలిచాం? ఆయన ఎందుకు వచ్చారు? అన్న చర్చ అర్థంలేనిది. సంఘ్ సంఘే.. ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీయే.
- హిందూ సమాజంలో ఒక సంఘాన్ని స్థాపించటం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేయట్లేదు.. సమాజాన్ని సంఘటితం చేయటానికే పనిచేస్తోంది. మాకు భారతీయులంతా సమానమే. ఎవ్వరూ పరాయివారు కాదు.
- రాజకీయ పరమైన, మతపరమైన విభేదాలు ముందునుంచీ ఉన్నాయి. అందరితో కలసి మెలసి జీవిస్తూ.. భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాపాడుతూ జీవించటమే మన సంస్కృతి.
- ప్రభుత్వాలు చాలా చేయగలవు. కానీ అన్నీ చేయలేవు. ప్రజల మనస్సుల్లో స్వార్థాన్ని తొలగించి దేశం కోసం అంతా ఏకమైతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మన లాంటి విశాల దేశంలో.. ప్రతి గ్రామంలోనూ సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తులు కావాలి. అందుకోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది.
- సమాజాన్ని ఏకం చేకుండా ఏ మంచి పనీ పూర్తి కాదు అని హెగ్డేవార్ 1911 నుంచి ఆలోచించి 1925 విజయదశమి రోజున చాలా తక్కువ మందితో తన ఇంటినుంచే ఈ సంఘ్‌ను ఏర్పాటు చేశారు.
- రాజకీయంగా మన మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వైషమ్యాలు ఉండకూడదు. సంఘ్ అందరినీ ఏకం చేసేదే తప్ప వేరు చేసేది కాదు. సమాజంలో ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. అంటే అంతా సంఘటితం కావాలి. దానికి నిర్మాణం కావాలి. దాని కోసమే సంఘ్ పనిచేస్తుంది.
- మనకు ఆదర్శాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ, వాటిని ఆచరించటంలోనే వెనకబడ్డాం. కొంత మెరుగైనప్పటికీ.. ఏ స్థాయిలో ఉండాలో అంత లేదు.
- సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా భారత్‌ను విశ్వ గురు చేయాలన్నదే మా ప్రయత్నం. మాటలు చెప్పి కాదు.. మన జీవనాన్ని అలా మార్చుకుని చేయాలి. అలాంటి సమాజాన్ని రూపొందించటమే మా లక్ష్యం.
- సంఘ్ ఉన్నది సంఘ్ పని చేయటానికి కాదు. ఇది అందరి కోసం. దీన్ని పరిశీలించేందుకు ఎంతో మంది మహానుభావులు వచ్చారు. వస్తుంటారు. వారందరి గురించీ నేను చెప్పాల్సిన పనిలేదు. వారందరి సూచనల్ని మేం పరిశీలిస్తాం. మా కార్యక్రమాలకు అనుగుణంగా వారి సిద్ధాంతాలు ఉంటే స్వీకరిస్తాం. సరైనవైతే అన్నీ స్వీకరిస్తాం. ఈ కార్యక్రమాన్ని చూడండి.. బాగుంటే భాగస్వాములవ్వండి.. ఆచరించండి. ఎవ్వరైనా రావొచ్చు.

ఫొటో సోర్స్, DD News
‘ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు భారత ఆలోచనకు విరుద్ధం’
చారిత్రకంగా ఆర్ఎస్ఎస్ దేని కోసం పాటుపడుతోందో, ఈరోజు ఏం ఆలోచిస్తోందో భారతీయులంతా తప్పనిసరిగా తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. భారత ఆలోచనకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు విరుద్ధమైనవన్న సంగతిని భారతీయులు మర్చిపోరాదని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రణబ్ ముఖర్జీ - ‘భారతరత్న?’
‘ప్రణబ్ ముఖర్జీ భారతరత్నకు సిద్ధమయ్యారా?’ అంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతులు రాజేంద్ర ప్రసాద్, వీవీ గిరి, ఎస్ రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలామ్‌లకు కూడా భారతరత్న పురస్కారం లభించిందని, అయితే వీరిలో ప్రసాద్, వీవీ గిరిలు రాష్ట్రపతులుగా పని చేసి రిటైర్ అయ్యిన తర్వాతే లభించాయని, ఈ జాబితాలో ప్రణబ్ ముఖర్జీ కూడా చేరుతారా? అంటూ ఆయన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
- ప్రస్తుతం (7.15 గంటలకు) సదస్సుకు హాజరైన ప్రముఖుల పరిచయ కార్యక్రమం జరుగుతోంది.
‘ఆ చిత్రాలు క్షోభ పెడుతున్నాయి’
‘‘ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకుడు, సిద్ధాంత కర్త అయిన ప్రణబ్ దా చిత్రాలను చూసి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, భారత గణతంత్ర విలువలను, భిన్నత్వాన్ని నమ్మే వారు క్షోభకు గురయ్యారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, RSSOrg/Facebook

ఫొటో సోర్స్, SANJAY TIWARI
అహ్మద్ పటేల్ అసంతృప్తి
ప్రణబ్ ముఖర్జీ నుంచి దీన్ని (ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరు కావటం) ఆశించలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. దీనికి ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన శర్మిష్ఠ ముఖర్జీ ట్వీట్‌ను కూడా ఆయన జత చేశారు. ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరు కావటం పట్ల ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, SANJAY TIWARI
- ఈ కార్యక్రమం సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం (6.50 గంటలకు) కార్యకర్తల కసరత్తు జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ శిక్షా వర్గ్‌లో ఇచ్చిన శిక్షణను కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, RSS
- ఆర్ఎస్ఎస్ జెండాకు మోహన్ భాగవత్ సహా సదస్సులోని వారంతా తమ సంప్రదాయం ప్రకారం కుడి చేతిని మడిచి నమస్కారం చేశారు. అయితే ప్రణబ్ ముఖర్జీ మాత్రం అలా చేయలేదు.
- వేదికపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్‌తో కలసి ముఖ్యఅతిథిగా ప్రణబ్ ముఖర్జీ కూడా ఆశీనులయ్యారు.
- నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలోని విజిటర్స్ బుక్‌లో ప్రణబ్ ముఖర్జీ, కేబీ హెడ్గేవార్‌ను భారతమాత మహోన్నత కుమారునిగా పేర్కొన్నారు. హెడ్గేవార్ జన్మస్థలాన్ని సందర్శించిన ప్రణబ్ ఆయనకు నివాళులు అర్పించారు.

ఫొటో సోర్స్, M.ATHARV

ఫొటో సోర్స్, RSSOrg/Facebook
- ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ్ మోహన్ భాగవత్‌ను కలిశారు. భాగవత్ ప్రణబ్‌కు ఆహ్వానం పలికారు.
- అయితే ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్టా ముఖర్జీ తన తండ్రి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాటలను మర్చిపోతారని, చిత్రాలు మాత్రం నిల్చిపోతాయని షర్మిష్ట అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

గోవిందాచార్య వ్యాసం: ప్రణబ్ రాకకు, ఆరెస్సెస్ ఆహ్వానానికి అర్థమిదే
కేఎన్ గోవిందాచార్య
మాజీ ప్రచారక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో ఆరెస్సెస్ నిర్వహించే శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘ్ వేదికపై కనిపించబోతున్నారు.
ఈ వార్త మీడియాలో చాలా కలకలం సృష్టించింది. దీంతో పార్టీ రాజకీయాల్లో సైతం అలజడి నెలకొనడంతో సంఘ్ పనితీరు ఎలా ఉంటుంది అనేదానిపై చాలా కోణాలు బయటపడడం లేదు.
గతంలో ప్రముఖ రాజకీయ నేతలు వివిధ సందర్భాల్లో సంఘ్ శిబిరాలకు, సంఘ్ వేదికపైకి వెళ్లారు. అనధికారిక చర్చల కోసం సంఘ్ నేతలను కలుస్తూనే ఉన్నారు. కానీ ప్రణబ్ ముఖర్జీ సంఘ్ సభకు వెళ్లనున్నారనే వార్తపై మాత్రం ఎక్కువ చర్చే జరుగుతోంది.
సంఘ్ నేతలు అవసరమైతే ప్రణబ్ ముఖర్జీ పేరును అత్యున్నత పదవికి సిఫారసు చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఆ వార్త పూర్తిగా నిరాధారం అని మీడియాకు చెందిన ఓ వ్యక్తి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అందరూ స్వయం సేవకులే..’
మొత్తం సమాజంలో ప్రజలందరూ స్వయం సేవకులే అని సంఘ్ భావిస్తుంది. వీరిలో కొందరు ఇప్పటివారైతే, మరికొందరు రేపటి వారని చెబుతుంది.
కొత్తవారిని కలవడం, వారి స్వభావం తెలుసుకోవడం, సంఘ్ గురించి వారికేం తెలుసో వివరాలు సేకరించడం, సంఘ్ కార్యక్రమాల గురించి వారికి చెప్పడం, వారితో కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవడం వంటివన్నీ సంఘ్ కార్యకలాపాల్లో భాగం.
సంఘ్ స్వయం సేవకులు కొత్త వారిని గౌరవంగా, మర్యాద పూర్వకంగా సంఘ్‌కు పరిచయం చేస్తారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. సమాధానం ఇవ్వలేమని అనిపించినప్పుడు, తమ పైవారితో మాట్లాడిస్తామని హామీ ఇస్తారు. తర్వాత వారితో సంప్రదింపులు కొనసాగిస్తారు.
కొత్తవారితో ప్రారంభించి.. మద్దతుదారులను, అప్పుడప్పుడూ కార్యక్రమాలకు వచ్చేవారిని, రోజూ శాఖలో కొన్ని బాధ్యతలు చూసేవారిని, అందరినీ శాఖలోకి తీసుకొచ్చి స్వయం సేవకులుగా మారుస్తారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక అభివృద్ధి క్రమం ఉంటుంది. సంఘ్ శాఖ దానికి మూలం.
ఇందులో ఒక గంట పాటు మైదానంలో శారీరక, మానసిక, మేధో శిక్షణ ఉంటుంది. స్వయం సేవకులు మిగతా 23 గంటలూ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక కోణాలను సంతులనం చేస్తూ జీవితాన్ని గడుపుతారు.
సమాజంలోని విద్య, సేవ, జ్ఞానోదయం, రాజకీయం లాంటి వివిధ రంగాల్లో మార్పులు తీసుకురావడం ఇందులో భాగంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, SUNITA ZADE
అందరికీ చేరువ కావాలని..
ప్రతి స్వయం సేవకుడూ ఏడాదిలో కనీసం 5 నుంచి 7గురు కొత్తవారిని సంఘ్‌లో చేర్పించడానికి ప్రయత్నిస్తారు. బాగా ఆలోచించి, అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులను తమ తమ మార్గాల్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తారు.
సంఘ్ తమ లక్ష్యాన్ని అన్ని కులాలు, ప్రాంతాలు, భాషలు, శాఖల వారితోపాటూ, చదువుకున్నవారు, నిరక్షరాస్యులు, డాక్టర్లు, లాయర్లు, రైతులు, కార్మికులు అందరి దగ్గరకూ చేర్చాలని అనుకుంటోంది.
దీన్ని కొనసాగించడం, మద్దతు కొనసాగేలా చూడడం, కలిసి పనిచేసే ప్రచారంలో అందరి అండ కూడగట్టడం స్వయం సేవకుల లక్ష్యం.

ఫొటో సోర్స్, EPA
శత్రువులతో కూడా ఆత్మీయంగా ఉండాలి
ఎవరైనా శత్రువు ఉంటే తమ ఆత్మీయతతో వారిలో శత్రుత్వం తగ్గేలా చేయాలి. సంఘ్ కార్యక్రమాలను దగ్గర నుంచి గమనించేలా చేయాలి, వారి భ్రమలు దూరం చేయాలి
తటస్థులు ఉంటే సంప్రదింపులతో వారిని సానుకూలంగా మార్చుకోవడం, అలా మారిన వారిని శాఖలో చేర్పించడం, సమాజ కోసం ఒక అప్రమత్తమైన పౌరుడి పాత్ర పోషించడం.
ప్రణబ్ ముఖర్జీ విషయంలో దేశమంతా ఇప్పుడు ఇంత చర్చ జరగడానికి, ప్రతిదాన్నీ రాజకీయంగా చూసే మీడియా దృష్టి కూడా ఒక కారణమే.
ప్రజాక్షేత్రంలో చాలా మంది వ్యక్తులను సంఘ్ శాఖకు తీసుకొస్తూ ఉంటారు. ఉదాహరణకు 1967లో బిహార్‌లో కరవు సహాయక చర్యల్లో ఉన్న స్వయం సేవకుల ద్వారా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మొదటిసారి సంఘ్‌ను కలిశారు.
ఆ సమయంలో బిహార్, నర్మదా జిల్లాలోని పక్రీ బరావా ప్రాంతంలో కరవు బాధితులకు స్వయం సేవకులు చేస్తున్న సహాయకార్యక్రమాలు చూసేందుకు జయప్రకాశ్ అక్కడికి వచ్చారు.
అక్కడ పనిచేసేవారంతా స్వచ్ఛంద సేవకులే, ఎవరికీ ఎలాంటి వేతనాలూ లేవు. అందరూ చదువుకున్నవారు కూడా, వారు మనస్ఫూర్తిగా 15 రోజుల సమయం వెచ్చిస్తున్నారు. అది జయప్రకాశ్ నారాయణ్‌ను ప్రభావితం చేసింది.

ఫొటో సోర్స్, SANJAY RAMAKANT TIWARI
'జన్‌సంఘ్ ఫాసిస్టు అయితే నేనూ ఫాసిస్టునే'
స్వయం సేవకుల దేశభక్తి, ఒక ప్రధాన మంత్రి కంటే తక్కువేం లేదని జయప్రకాశ్ మీడియాతో కూడా అన్నారు.
ఆ తర్వాత, ఆయన సంఘ్ మద్దతుతో జరిగిన విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమానికి నేతృత్వం కూడా వహించారు. ఉద్యమ సమయంలో జరిగిన సంఘ్ సమావేశంలో పాల్గొన్న ఆయన "జన్‌సంఘ్ ఫాసిస్టు అయితే నేను కూడా ఫాసిస్టునే" అన్నారు.
1978లో జనతా పార్టీ పాలన సమయంలో జయప్రకాశ్.. సంఘ్ పట్నాలో నిర్వహించిన ప్రాథమిక శిక్షణ తరగతిలో ప్రసంగించారు.
అదే విధంగా, కన్యాకుమారిలో వివేకానంద సేవా స్మారక నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ఏక్ నాథ్ రనడే సంఘ్ స్వయం సేవకుడిగానే ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాంటి అన్ని పార్టీల ప్రభుత్వాల నుంచీ సహకారం లభించింది.
అందరూ ఏక్ నాథ్‌ను తమ వాడిగా భావించారు.
సంఘ్ స్వయం సేవక్ రాజూ భయ్యా (తర్వాత సంఘ్ ప్రముఖ్ కూడా అయ్యారు) అంటే ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రభాన్ గుప్తకు ఎంత ఆత్మీయుడో అందరికీ తెలుసు.

ఫొటో సోర్స్, PTI
గంగకు జాతీయ నది హోదా తెచ్చిన ప్రణబ్
నానాజీ దేశ్‌ముఖ్ కాంగ్రెస్‌తోపాటూ ఎన్నో పార్టీల ప్రముఖుల ఇళ్లకు కూడా వెళ్లేవారు. వారంతా నానాజీని తమ ఇంట్లోవాడిలాగే భావించేవారు.
రోజూ ఉదయం నడకకు వెళ్లే కేరళ కమ్యూనిస్టు నేత అచ్యుత్ మీనన్ అయినా, దిల్లీ నార్త్ ఎవెన్యూలో ఉదయం వాకింగ్ చేసే ప్రణబ్ ముఖర్జీ అయినా, అశోక్ రోడ్ లో వ్యాహ్యాళికి వెళ్లే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేఎన్ సింగ్ అయినా, అప్పట్లో ఉదయం చెడ్డీలు వేసుకుని శాఖకు వెళ్లేవారు. వీరికి తలవంచి నమస్కరించేందుకు వెనకాడేవారు కాదు.
ప్రణబ్‌తో ఉన్న బలమైన బంధం వల్ల, ఆడ్వాణీ, ఖండూరీ, హరీష్ రావత్, అజిత్ జోగి, డాక్టర్ మన్మోహన్ సింగ్, జైరామ్ రమేష్, ఉమా భారతి లాంటి వారి సహకారంతో గంగానదికి జాతీయ నది హోదాను తీసుకురాగలిగాం.
పార్టీలకు అతీతంగా, సమాజం కోసం పరస్పర సహకారం అనేది భారత సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల రాజకీయాలతో భారత దేశంపై నిర్లక్ష్యం నీడలు కమ్ముకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒకసారి స్వయం సేవక్ అయితే శాశ్వతంగా ఉంటారు
సంఘ్ పనితీరు గురించి ఒక ప్రముఖ స్వయం సేవక్ ప్రొఫెసర్ యశ్వంత్ రావ్ కేల్కర్ కొన్నిసూచనలు చేశారు. ప్రతి లోహం కరుగుతుంది. కరగని లోహం అంటూ లేనే లేదు. కానీ దానిని ఎంత అవసరమో అంత వేడి చేయాల్సి ఉంటుంది అంతే..
ఏదైనా లోహం కరగలేదంటే, ఆ తప్పు దానికి కాదు. దానిని కరిగేలా వేడి చేయలేదని అర్థం.
లోహం కరిగించే వేడిని, ఉష్ణోగ్రతను పెంచినట్టే, స్వయం సేవకులు తమ దృష్టిని కేంద్రీకరించాలి.
ఇక్కడ లోహానికి అర్థం కొత్త వ్యక్తి. వారు ఎక్కడ పని చేసినా మొత్తం సమాజం అంతా ఒకటే. అందరూ స్వయం సేవకులే. కొందరు ఈరోజు శాఖకు వెళ్తే, మరికొందరు రేపు వెళ్తారు. అందుకే అందరిపై నిస్వార్థ స్నేహం ఉండాలి.
తర్వాత ఒకసారి శాఖకు వస్తే, స్వయం సేవక్ అయితే, వాళ్లు జీవితాంతం స్వయం సేవకులు అవుతారని చెప్పారు. వారి నుంచి ఆచార, వ్యవహారాలు కోరుకుంటారు.
దీని ప్రకారం, సంఘ్ కార్యాలలోకి ప్రవేశించడం అనేది ఎప్పుడూ ఉంటుంది. బయటికి వెళ్లడంలో నిషేధంపై సహజ స్థితి కొనసాగుతుంది.
ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్ లాగే కాలక్రమేణా దేశంలో ప్రతి ఏటా కొన్ని వేల మంది గురుపూర్ణిమ కార్యక్రమం లేదా సంఘ్ నిర్వహించే 6 ఉత్సవాల్లో, వార్షికోత్సవాలలో పాల్గొంటూనే ఉంటారు.
సంఘ్ స్వయం సేవకులు తమ సమర్థత, సంప్రదించే పరిధిని బట్టి కొత్త వారిని కలుస్తారు, వారి ఇళ్లకు వెళ్లి విశ్వాసాన్ని గెలుచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అందుకే ఇంత చర్చ
ప్రస్తుతం దేశంలో సుమారు 50 వేలకు పైగా సంఘ్ శాఖలు ఉన్నాయి. రోజూ వీటికి లక్షల మంది వెళ్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సంఘ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజల్లో ఎక్కువ పాపులారిటీ ఉండడం, లేదా ప్రముఖ పదవిని నిర్వహించడం వల్ల ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్లడంపై ఎక్కువ చర్చ జరుగుతుండొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








