BBC Top 5 News: ఆర్ఎస్ఎస్ సదస్సులో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ.. కుమార్తె శర్మిష్ఠ అసంతృప్తి

ప్రణబ్ ముఖర్జీ

ఫొటో సోర్స్, TWITTER@SHARMISTHA_GK

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.

నాగ్‌పూర్‌లోని రేషీమ్‌బాగ్ మైదానంలో గురువారం జరిగిన సంఘ్ శిక్షా వర్గ్ మూడో వార్షిక కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ప్రణబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అయితే, అంతకు ముందు ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాల్సిందిగా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు.

ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కూడా తన తండ్రి నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వరుసగా ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'ఆర్ఎస్ఎస్‌వి చౌకబారు ఎత్తుగడలు' అని తీవ్రంగా విమర్శించిన శర్మిష్ఠ, 'మీరు చేసే ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారు. కానీ దృశ్యాలు మాత్రం ఎప్పటికీ మిగిలిపోతాయి' అని తన తండ్రికి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'మీరు నాగ్‌పూర్‌కు వెళ్లడం ద్వారా, కట్టుకథలు అల్లడంలో, పుకార్లను వ్యాపింపజేయడంలో మీరు బీజేపీ/ఆర్ఎస్ఎస్‌లకు తోడ్పడిన వారవుతారు. వాటికి ఓ మేరకు విశ్వసనీయత కల్పించినవారవుతారు. ఇది ప్రారంభం మాత్రమే' అంటూ మరో ట్వీట్ చేశారు.

కిమ్, ట్రంప్

ఫొటో సోర్స్, EPA

చర్చల కోసం కిమ్ మమ్మల్ని 'బతిలాడారు'!

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌తో జరగాల్సిన చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసినప్పుడు, చర్చలను మళ్లీ జరిగేలా చూడాలంటూ కిమ్ తమను 'ప్రాధేయపడ్డారని' ట్రంప్ న్యాయవాది రూడీ జూలియానీ తెలిపారు.

ట్రంప్ కఠిన వైఖరి ఫలితంగానే ఉత్తర కొరియా అనివార్యంగా తన వైఖరిని మార్చుకుందని జూలియానీ ఇజ్రాయెల్‌లో జరిగిన ఒక పత్రికా సమావేశంలో అన్నారు.

ఉత్తర కొరియా 'తీవ్రమైన కోపం, ద్వేషం' ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ గత నెలలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఉత్తర కొరియా స్నేహపూరిత స్పందన వల్ల సింగపూర్‌లో జూన్ 12న జరగాల్సిన ద్వైపాక్షిక చర్చల ప్రతిపాదన మళ్లీ పట్టాల పైకెక్కిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీబీఐ

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/Getty Images

నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు

అధ్యాపకుల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్‌తో పాటు పలువురు ప్రొఫెసర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.

13 మంది బోధనా సిబ్బంది నియామకం విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో బుధవారం అకాడమీలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

బోధనా అనుభవానికి సంబంధించి నకిలీ సంతకాలు, ధ్రువపత్రాలతో ఆ సిబ్బంది ఉద్యోగాలు పొందినట్టుగా సీబీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

శాంతి

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ శాంతి సూచీలో 136వ స్థానంలో భారత్

ప్రపంచ శాంతి సూచీలో భారత్‌ తన స్థానాన్ని స్వల్పంగా మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది 136వ స్థానంలో నిలిచింది.

గత ఏడాది 137వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక స్థానం ముందుకొచ్చింది.

కాగా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌(ఐఈపీ) విడుదల చేసిన ఈ నివేదికలో ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రియాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 163 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం సిరియా అట్టడుగున ఉంది.

ఇండియాలో ఆయుధాల దిగుమతి తగ్గడం, తీవ్రమైన నేరాల అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితమివ్వడంతో స్థానం మెరుగుపడినట్లు నివేదిక పేర్కొంది.

కాలా

'కాలా' విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

రజినీకాంత్‌ నటించిన 'కాలా' సినిమా విడుదలకు సుప్రీం కోర్టు అనుమతించింది.

'కాలా' కథ, పాటలు తమవని పేర్కొంటూ కేఎస్‌ రాజశేఖరన్‌ అనే సినీ నిర్మాత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా విచారించిన సుప్రీం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.

దీంతో దేశవ్యాప్తంగా ఈ రోజు విడుదలకానుంది. అయితే, కర్ణాటకలోనూ దీనిపై వివాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత ఉత్కంఠ పరిస్థితులున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)