మంత్రిగారూ... రైతుల నిరసనలు ‘పబ్లిసిటీ స్టంట్‌’ అని ఎన్నికల ముందు అనగలరా?

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, AIKS

    • రచయిత, సతీష్ ఊరుగొండ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏడు రాష్ట్రాల్లో రైతులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో 'గావ్ బంద్‌' పేరుతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

తాము చెమటోడ్చి పండించిన పంటలను, కూరగాయలు, పాలను రోడ్డుపై పారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. కూరగాయల వాహనాలను మార్కెట్లకు తరలించకుండా అడ్డుకుంటున్నారు.

అఖిల భారత కిసాన్ మహాసంఘ్ సారథ్యంలో సుమారు 100 రైతు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకుంటే త్వరలో పట్టణాలకు కూరగాయలు, పాల సరఫరా పూర్తిగా బంద్ చేస్తామని రైతు సంఘాలు ఇదివరకే హెచ్చరించాయి.

పది రోజుల తమ ఆందోళనలో చివరి రోజైన జూన్ 10న 'భారత్ బంద్‌' చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.

కాగా, రైతుల సమ్మెపై అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

వీరిలో ఒకరు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి. మరొకరు హర్యానా ముఖ్యమంత్రి. ఇంకొకరు మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి.

"మీడియా దృష్టిలో పడేందుకే రైతులు నిరసనలు చేస్తున్నారని, అదంతా పబ్లిసిటీ స్టంట్" అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారం అన్నారు.

"దేశంలో 14 కోట్ల మంది రైతులున్నారు. వారిలో కొందరికి మీడియాలో కనిపించాలనే తాపత్రయం ఉంది" అని ఆయన అన్నట్లు 'ఇండియా టుడే' పేర్కొంది. అసలు ఎన్డీఏ హయాంలో వ్యవసాయ రంగ ఉత్పత్తి బాగా పెరిగిందని కూడా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

line

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

"అసలు రైతులకు ఎలాంటి సమస్యలు లేవు. అనవసరమైన విషయాలపై వారు దృష్టి పెడుతున్నారు" అని ఆయన అన్నారు.

పండించిన పంటను అమ్ముకోకపోతే రైతులకే నష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

line

"దేశంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారు, ఎవరూ ఆందోళన చేయడం లేదు" అని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి బాలకృష్ణ పాటిదార్ చెప్పారు.

మధ్యప్రదేశ్ సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని, సమస్యలను పరిష్కరిస్తారని కేంద్ర రాష్ట్రాలపై వారికి నమ్మకం ఉందని ఆయన చెప్పినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌' పేర్కొంది.

ఏడాది క్రితం, 2017 జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌లో తమ సమస్యలపై ఆందోళనకు దిగిన రైతులపై జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మంత్రుల తాజా వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వీరిని వెంటనే పదవుల్లోంచి తప్పించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేసినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది.

సోషల్ మీడియాలో కూడా మంత్రుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమైంది.

"కేంద్ర వ్యవసాయ మంత్రి రైతుల ఆందోళన ఒక గిమ్మిక్కు అంటారు. రైతుల ఆందోళనలో విషయం లేదని హరియాణా సీఎం అంటున్నారు. ఇది నిజంగా దురహంకారమే" అని 'ద ప్రింట్‌' వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా అభిప్రాయపడ్డారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

line

"2019 ఎన్నికల్లో రైతులే వీరికి సరైన బుద్ధి చెబుతారని" సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.

"రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి వ్యవసాయ మంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు" అని ఆయన ట్వీట్ చేశారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

line

కేంద్ర వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలపై బీబీసీ న్యూస్ తెలుగు నెటిజన్ల అభిప్రాయాలు కోరింది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను చాలామంది సోషల్ మీడియా యూజర్లు తప్పబట్టారు.

line
line
కామెంట్లు

రైతుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రాహుల్‌గాంధీ జూన్ 6న మధ్యప్రదేశ్‌లో రైతులను కలిసి, వారికి మద్దతు తెలపనున్నారు.

భారత దేశంలో రోజూ 35 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు 10 రోజుల పాటు నిరసనలు చేస్తున్నారు. వారికి అండగా ఉంటానని రాహుల్ ట్వీట్ చేశారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

line

రైతుల డిమాండ్లు ఇవి

రైతులు ప్రధానంగా మూడే మూడు డిమాండ్లు చేస్తున్నారు.

1. రైతులు తీసుకున్న అన్ని రుణాలు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలి.

2. వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.

3. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి.

వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు ఆ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడం, తదితర చిన్న చిన్న డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు పెట్టారు.

పై డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానట్టయితే పట్టణాలకు కూరగాయలు, పాల సరఫరా పూర్తిగా నిలిపివేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.

కిసాన్ సభ

ఫొటో సోర్స్, AlL india kissan sabha

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర రైతులు నిర్వహించిన మహా పాదయాత్ర

ఈ ఏడాది ప్రారంభంలో కూడా మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వరకు అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన విరమించారు. హామీల అమలు కోసం మళ్లీ అన్నదాతలు రోడ్డెక్కారు.

అయితే, రైతుల ఆందోళన వెనక విపక్షాల ప్రమేయం ఉందని అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

శాంతికి విఘాతం కలిగించి, అలజడి సృష్టించడం కోసమే కొందరు రైతుల ఆందోళనను హింసాత్మకంగా మారుస్తున్నారని బీజేపీ నాయకుడు రాజ్‌వీర్ సింగ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కొందరు విపక్ష పార్టీ కార్యకర్తలు బలవంతంగా, దౌర్జన్యంగా రైతుల నుంచి పాలను లాక్కొని రోడ్లపై పారబోస్తున్నారని అంటూ, కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అయితే, రైతులు ఇలా కూరగాయలనూ, పాలను రోడ్లపై పారబోయడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. రైతుల సమస్యలు న్యాయమైనవే కానీ ఇలా పంటల్ని రోడ్డుపాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)