'ఫేక్ న్యూస్ అవార్డుల' విజేతలు వీరే.. జాబితాను ట్విటర్‌లో షేర్ చేసిన ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో 2017లో పక్షపాతంతో కూడిన వార్తలు, తప్పుడు వార్తలు నిరాటంకంగా వెలువడ్డాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ వ్యాఖ్యానించింది.
ట్రంప్‌కు సంబంధించిన మీడియా కవరేజీలో 90 శాతం వరకు వార్తలు వ్యతిరేక దృక్పథంతో కూడినవేనని పార్టీ పేర్కొంది.
2017వ సంవత్సరానికి 'తప్పుడు వార్తల (ఫేక్ న్యూస్) అవార్డుల' విజేతలు వీరేనంటూ, ఆయా కథనాల సంక్షిప్త సమాచారం, సంబంధిత మీడియా సంస్థల పేర్లతో ఒక జాబితాను రిపబ్లికన్ పార్టీ తన వెబ్‌సైట్‌లో పొందుపరచింది.
ఈ అంశానికి సంబంధించిన లింక్‌ను ''తప్పుడు వార్తల విజేతలు ఎవరంటే...'' అనే వ్యాఖ్య జోడించి ట్రంప్ గురువారం ట్విటర్‌లో షేర్ చేశారు. జాబితాలో అత్యధికంగా నాలుగు వార్తాకథనాలు సీఎన్‌ఎన్ అందించినవే ఉన్నాయి.
రిపబ్లికన్ పార్టీ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం..
1.ద న్యూయార్క్ టైమ్స్: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించిన రోజు.. ''ఆర్థిక వ్యవస్థ ఎన్నటికీ కోలుకోలేదు'' అని ఈ పత్రికలో ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత పాల్ క్రుగ్‌మన్ తప్పుగా అంచనా వేశారు.
2.ఏబీసీ న్యూస్: ట్రంప్-రష్యా సంబంధాలపై సీనియర్ జర్నలిస్టు బ్రయాన్ రాస్ కథనం అల్లారు. దీని కారణంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
3.సీఎన్ఎన్: వికీలీక్స్ సేకరించిన రహస్య పత్రాలను ట్రంప్, ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ముందే చూశారని సీఎన్‌ఎన్ తప్పుడు వార్త అందించింది.
4.టైమ్: అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని 'ఓవల్ ఆఫీస్'లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహాన్ని ట్రంప్ తొలగించారని 'టైమ్' తప్పుగా రాసింది.

ఫొటో సోర్స్, Donald Trump /Twitter
5.ద వాషింగ్టన్ పోస్ట్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పెన్సకోలా నగరంలో ట్రంప్ ర్యాలీకి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ పత్రిక విలేఖరి జనం రావడానికి కొన్ని గంటల ముందు ర్యాలీ జరిగే చోటు ఖాళీగా ఉండటాన్ని చూపించి, జనం రాలేదన్నారు.
6.సీఎన్‌ఎన్: జపాన్ రాజధాని టోక్యోలో చేపలకు ట్రంప్ పరిమితికి మించి ఆహారం వేస్తున్నట్లు కనిపించేలా ఒక వీడియోలోని దృశ్యాలను సీఎన్‌ఎన్ వక్రీకరించి చూపింది.
7.సీఎన్‌ఎన్: ఒక రష్యన్‌తో అమెరికా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఆంథోనీ స్కారామూచి సమావేశం గురించి సీఎన్‌ఎన్ తప్పుగా వార్తాకథనం అందించింది. తర్వాత దానిని ఉపసంహరించుకుంది.
8.న్యూస్‌వీక్: పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డ్యూడా భార్య, పోలండ్ ప్రథమ మహిళ అగాటా కోర్న్‌హౌజర్-డ్యూడా.. ట్రంప్‌తో కరచాలనానికి నిరాకరించారని 'న్యూస్‌వీక్' తప్పుగా రాసింది.
9.సీఎన్‌ఎన్: తనపై దర్యాప్తు జరగట్లేదని ఎఫ్‌బీఐ చెప్పిందన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ విభేదించారని సీఎన్‌ఎన్ తప్పుగా పేర్కొంది.
10.ద న్యూయార్క్ టైమ్స్: ఒక వాతావరణ నివేదికను ట్రంప్ ప్రభుత్వం తొక్కి పెట్టిందని ఈ పత్రిక మొదటి పేజీలో తప్పుడు వార్త రాసింది.
11. అమెరికా ప్రజలకు మీడియా అందించిన అతిపెద్ద తప్పుడు వార్త ఏది కావొచ్చంటే.. రష్యాతో ట్రంప్ కుమ్మక్కయ్యారన్నదే.
ఇవి కూడా చదవండి:
- Quiz: ట్రంప్‌కు పెట్టిన పరీక్ష ఇదే.. మీరు రాస్తే పాసవుతారా?
- అమెరికా న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- సుప్రీంకోర్టు: ఇంతకూ ‘రోస్టర్’ ఏంటి? దాని ప్రాధాన్యం ఏంటి?
- జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు రిటైర్డు జడ్జిల బహిరంగ లేఖ
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’
- కోడళ్ల సంఘం: ఏమిటీ కోడళ్ల ప్రత్యేకత?
- ఏపీ: విటులకు కటకటాలు తప్పవిక!
- గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








