అంచల్ ఠాకూర్: భారత తొలి ‘స్కీయింగ్’ విజేతపై ప్రశంసల వర్షం

ఫొటో సోర్స్, Roshan Thakur
అంతర్జాతీయ స్కీయింగ్ ఈవెంట్‌లో భారత యువతి ఒకరు తొలిసారిగా విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి చెందిన అంచల్ ఠాకూర్.. టర్కీలోని అంతర్జాతీయ స్కీ సమాఖ్య( ఎఫ్ఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
వింటర్ స్పోర్ట్స్‌కు భారత్‌లో సరైన గుర్తింపు కూడా లేదు. దేశంలో ఇలాంటి క్రీడలకు సంబంధించిన భౌగోళిక వాతావరణ పరిస్థితులూ పెద్దగా లేవు.
తన విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతన్నానని అంచల్ బీబీసీతో చెప్పారు.
'టర్కీ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఆశ్చర్యపోయాను. భారత్‌లో మంచు ప్రాంతాలు ఉంటాయా? అని చాలా మంది అడిగారు. ఎందుకుండవు, హిమాలయాలు ఉన్నాయి కదా? అని వాళ్లకు చెప్పాను' అని అంచల్ బీబీసీతో అన్నారు.
ఆమె పోటీలో గెలిచిన వెంటనే సోషల్ మీడియాలో ప్రశంసించిన మొదటివారిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఒకరు.
'ఠాకూర్ చారిత్రక విజయంతో దేశమంతా పరవశించిపోతోంది' అని ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి ట్వీట్ చూసి చాలా ఉత్సాహానికి గురయ్యానని, ఇలాంటి ప్రశంసలు దేశంలో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని అంచల్ పేర్కొన్నారు.
బుధవారం ట్విటర్‌లో అంచల్ విజయమే ట్రెండింగ్‌గా నిలిచింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌తో సహా పలువురు భారతీయులు ట్విటర్ వేదికగా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

ఫొటో సోర్స్, @Ra_ThORe

ఫొటో సోర్స్, @anita_chauhan80

ఫొటో సోర్స్, @OYERJALOK
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంచల్ ఠాకూర్ తండ్రి రోషన్ ఠాకూర్.. వింటర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుజీఎఫ్ఐ)కి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. 'మా అమ్మాయి విజయంతో దేశంలో వింటర్ గేమ్స్‌కి ఆదరణ పెరగొచ్చు' అన్నారు.
'అంచల్ విజయాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ, క్రీడల మంత్రి రాథోడ్‌లు చేసిన ట్వీట్‌లను చూశాను. ఇవి సానుకూల పరిణామాలు. మరింతమంది వింటర్ స్టోర్స్‌లో అడుగుపెట్టడానికి ఇలాంటివి దోహదం చేస్తాయి' అని ఆయన బీబీసీకి చెప్పారు.
నెలల తరబడి కఠోర సాధన చేసినందుకు ప్రతిఫలం లభించిందని, పోటీలో మూడో స్థానంలో నిలవడానికి ఇదే కారణమని అంచల్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో చెప్పారు. మంచి ఆరంభంతో పోటీ మొదలుపెట్టడంతోనే విజయం సాధ్యమైందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- సోషల్‌మీడియాలో మీసం మెలేస్తున్న దళితులు!
- కూల్‌డ్రింక్స్ తాగితే కొవ్వు పెరుగుతుందా?
- ‘ఏడాదిన్నరలో అమెరికా వీడి వెళ్లండి’
- ఓల్డ్‌మాంక్ సృష్టికర్త మృతి
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








