అజ్ఞాతవాసి: ఇంతకీ ఇది ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా? ఆ దర్శకుడేమంటున్నారు?

ఫొటో సోర్స్, HaarikaHassineOfficial/pan-europeenne
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అజ్ఞాతవాసి సినిమా కాపీ కొట్టిందా? కాదా?
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న చర్చ ఇదే.
కొన్ని సీన్లు కాపీ చేశారనో కొన్ని ట్యూన్లు దించారనో ఆరోపణలు, విమర్శలు సాధారణంగా వస్తుంటాయి. అదీ కొందరు ప్రేక్షకులు మాత్రమే ఇలా ఆరోపణలు చేస్తుంటారు.
కానీ అజ్ఞాతవాసి విషయంలో జరుగుతోంది వేరు. ఏకంగా ఒక సినిమా దర్శకుడే ఆ అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు..
జరోమ్ సల్.. ఫ్రెంచి దర్శకుడు. ఆయన తీసిన సినిమా లార్గో వించ్.
2008 డిసెంబర్ 17వ తేదీన ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల్లో ఇది విడుదలైంది. ఈ సినిమాను కాపీ కొట్టి అజ్ఞాతవాసి తీసారన్నది ప్రధాన ఆరోపణ.

ఫొటో సోర్స్, Facebook/Haarika and Hassine Creations
కథేంటంటే..
ఒక వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన కోటీశ్వరుడు హత్యకు గురవుతాడు. ఆయన ఎవ్వరికీ తెలియకుండా పెంచిన కొడుకు.. తండ్రి స్థానాన్ని ఎలా భర్తీ చేశాడు? మధ్యలో కార్పొరేట్ రాజకీయాలు ఎలా ఉంటాయి? అన్నదే లార్గోవించ్ స్టోరీ.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. 2011 ఫిబ్రవరి 16వ తేదీన ‘ది బర్మా కాన్స్పిరసీ’ పేరుతో ఫ్రెంచి, ఇంగ్లీషు భాషల్లో ఇది విడుదలైంది.
సెటిల్‌మెంట్?
లార్గో వించ్ దేశీయ హక్కులు టి-సిరీస్‌కు ఉన్నాయి. ఈ సంస్థ అజ్ఞాతవాసి నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపిందని, ఆ తరువాత ఇరువురి మధ్య సెటిల్‌మెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి.
అయితే అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టి-సిరీస్‌తో జరిగిన సెటిల్‌మెంట్ భారతదేశానికి మాత్రమే సంబంధించిందని తాజాగా జరోమ్ అన్నారు. మిగతా దేశాల సంగతేమిటని ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.
ఈ పరిణామాలను చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఈ వివాదం తెగేలా కనిపించడం లేదు. కాపీ రైట్ల విషయంలో ఆయన తదుపరి ఏం చేయబోతున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫ్రెంచి మూవీ డైరెక్టర్ స్పందన
గత ఏడాది డిసెంబర్లోనే అజ్ఞాతవాసి సినిమా కాపీ అన్న ఆరోపణలు ప్రారంభమయ్యాయి. విడుదలకు ముందే ఈ వివాదంపై జరోమ్ స్పందించారు. తాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సహాయంతో అజ్ఞాతవాసి ట్రైలర్ చూశానని, తప్పకుండా సినిమా చూస్తానని ట్వీట్ చేశారు. "నేను తప్పకుండా టికెట్ కొంటాను.. సినిమా టికెట్ కంటే ముందు విమానం టికెట్" అంటూ ఆ సమయంలో ఆయన ట్వీట్ చేశారు. ఇది అనేక సందేహాలను రేకెత్తించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చాలా దగ్గరగా
ఆ తరువాత బుధవారం (జనవరి 10న) విడుదలైన అజ్ఞాతవాసి సినిమాను చూసినట్లు జరోమ్ ట్వీట్ చేశారు. పారిస్ నగరంలోని లా బ్రడే థియేటర్‌లో జనవరి 10వ తేదీన ఈ సినిమా చూసినట్లు, టికెట్‌ను ఫొటో తీసి ట్వీట్ చేశారు. "(థియేటర్‌లో) గొప్ప వాతావరణం.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాను బాగా ఇష్టపడేవాడినే.. దురదృష్టం కొద్దీ ఈ కథ నాకు బాగా తెలిసిందే" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అజ్ఞాతవాసి కథ అచ్చం లార్గో వించ్‌లాగే ఉందని కొన్ని రివ్యూ వెబ్‌సైట్లు రాశాయి. సీన్లను మాత్రమే కాదు ఏకంగా సినిమానే దించేశారని చెబుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రేక్షకుల స్పందన
ఇది ఇలా ఉండగా అజ్ఞాతవాసి సినిమా చూసిన కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొందరు ఇది అచ్చం కాపీ సినిమానే అంటూ పోస్టులు చేశారు. మరికొందరు సీన్లు ఇలా కాపీ చేశారంటూ ఫొటోలు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘కాకతాళీయం కావొచ్చు’
అయితే కొందరు అజ్ఞాతవాసికి మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచం చాలా పెద్దదని కోట్ల మంది జనాభా ఉంటారని, వారిలో చాలా మందికి ఒకే రకమైన ఆలోచనలు రావడంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు. కథ కలవడమనేది కాకతాళీయం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
స్పందన రాలేదు
జరోమ్ ఆరోపణలపై అజ్ఞాతవాసి నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించగా ఇంత వరకు స్పందన రాలేదు. ఈ విషయంపై జరోమ్‌ను కూడా ట్విటర్ ద్వారా సంప్రదించాం. ఆయన నుంచి కూడా బదులు రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Facebook/Haarika & Hassine Creations
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)