ప్రెస్ రివ్యూ: హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా చేసింది చంద్రబాబేనన్న కేటీఆర్

ఫొటో సోర్స్, KTRTRS/facebook
హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారని ఈనాడు ఓ కథనంలో వెల్లడించింది.
దాదాపు 17 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను చంద్రబాబు ఒప్పించగలిగారని ఆయన చెప్పారు.
గురువారం హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
టెక్ మహీంద్రా సీఈఓ సి.పి. గుర్నానీ అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ పైవిధంగా స్పందించారు. నిపుణుల లభ్యత కారణంగా గూగూల్, మైక్రోసాఫ్ట్ తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయన్నారు.
రానున్న రోజుల్లో ఏపీ రాజధాని అమరావతి పురోభివృద్ధి చెందుతుందని, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలదని కేటీఆర్ ఆకాంక్షించారు.

మర్డర్ ప్లాన్ స్వాతిదే!
ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగర్‌కర్నూల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ఈ నెల 10న అతడి భార్య స్వాతిని అరెస్ట్ చేసి వివరాలు సేకరించినట్లు కేసు ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాజేశ్‌తో స్వాతికి వివాహేతర సంబంధం ఉందని వెల్లడించారు.
ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని రాజేశ్ చెప్పగా, పిల్లలను విడిచి రాలేనని స్వాతి చెప్పిటన్లు తెలిపారు. ఈ క్రమంలోనే సుధాకర్‌రెడ్డిని హత్యచేసి, రాజేశ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ఇంటికి తీసుకురావాలని స్వాతి వ్యూహం రచించిందని వివరించారు.
కాగా, భర్త సుధాకర్‌రెడ్డి అంటే స్వాతికి ఇష్టం లేదని రాజేశ్ తెలిపారు. రెండేళ్లుగా స్వాతితో వివాహేతర సంబంధం ఉందని, ఈ హత్యకు ఆమే ప్లాన్ చేసిందని చెప్పారు.
ఆమెపై వ్యామోహంతోనే సుధాకర్‌రెడ్డిని హత్యచేసినట్లు రాజేశ్ అంగీకరించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Alok Putul
కోడెవాగు ఎన్‌కౌంటర్ బూటకం: గద్దర్
సాక్షి ప్రచురించిన కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెల్లవారుజామున పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
జిల్లాలోని టేకులపల్లి మండలం చింతోనిచెలక-మేళ్లమడుగు గ్రామాల శివార్లలోని కోడెవాగు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
వీరిని సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందినవారిగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది భారీ ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.
టేకులపల్లి మండలంలోని కోడెవాగు వద్ద 16 మంది సాయుధ మావోయిస్టులు సంచరిస్తు న్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
దాంతో బోడు ఎస్సై అనిల్ గురు వారం తెల్లవారుజామున తన బృందంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది.
గాలింపు సందర్భంగా మావోయిస్టులు కనబడటంతో లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారని.. కానీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని భద్రాద్రి కొత్త గూడెం ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా చెప్పారు.
ఖండించిన గద్దర్
తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్ విమర్శించారు.
కోడెవాగు ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య, ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ పేర్కొన్నారు.
ఏజెన్సీలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రజలను ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్..!
కేంద్ర ప్రభుత్వం గత జులై నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు కూడా రావొచ్చని బిహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ మోడీ అన్నారని నవతెలంగాణ కథనం తెలిపింది.
గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీలో భాగం కావొచ్చన్నారు.
ఇది తమ జీఎస్టీ కౌన్సిల్ భావనగా కూడా ఉందన్నారు. అయితే ఎప్పటి కల్లా ఇవి జీఎస్టీ పరిధిలోకి వస్తాయే ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు.
చట్టాన్ని మార్చకుండానే ఈ ఉత్పత్తులను జీఎస్టీలో భాగం చేయడానికి వీలుందన్నారు.
ఒక వేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకువస్తే అధిక పన్ను శ్లాబులోకి రావొచ్చన్నారు.
అదే విధంగా రాష్ట్రాలు తమ స్వతంత్రతను, రెవెన్యూను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా లెవీ సెస్‌లను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా ఉండొచ్చన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్రోలియం నుంచి 40 శాతం వరకు రెవెన్యూ ఆర్జిస్తున్నాయి.
ప్రస్తుత పన్ను వసూళ్లు స్థిరత్వంలోకి వస్తే శ్లాబులను కూడా తగ్గించే అవకాశం ఉందని ప్రధానీ మోదీ ఇది వరకే సంకేతాలు ఇచ్చారు.
ఇప్పుడు జీఎస్టీలో 0 శాతం, 5, 12, 18, 28 శాతం చొప్పున ఐదు శ్లాబులు అమల్లో ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్‌ను కూడా విధిస్తున్నారని ఆ కథనం తెలిపింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








