తగ్గిన జీఎస్టీ: ఏయే వస్తువులపై ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
అసోంలోని గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 50 వస్తువులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు.
జులై 1, 2017 న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. మొదట 228 వస్తువులు 28 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలో ఉండగా, ఇప్పుడు 178 వస్తువులను ఆ శ్లాబ్ నుంచి తప్పించాలని నిర్ణయించారు.
వాటిని ఇప్పుడు 18 శాతం పన్ను శ్లాబ్‌లోనికి తీసుకువచ్చారు.
ఈ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పన్ను శ్లాబులో చేసిన మార్పులు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని అన్నారు.
13 వస్తువులను 18 శాతం పన్ను శ్లాబ్ లోంచి 12 శాతం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
దాంతో పాటు 6 వస్తువులను 18 శాతం శ్లాబ్ నుంచి 5 శాతం శ్లాబ్ కిందకు తెచ్చారు. 8 వస్తువులపై 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
6 వస్తువులపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్ పరిధిలోనికి వచ్చినవి:
- మోటర్ కార్
- మోటర్ సైకిల్
- చాకొలేట్లు, కొకోవా బటర్, కొవ్వు పదార్థాలు, నూనె
- పాన్ మసాలా
- రెఫ్రిజిరేటర్లు
- పెర్‌ఫ్యూమ్, డియోడరెంట్
- మేకప్ యాక్సెసరీలు
- వాల్ పుట్టీ
- వాల్ పెయింట్
- టూత్ పేస్టులు
- షేవింగ్ క్రీములు
- ఆఫ్టర్ షేవ్
- లిక్విడ్ సోప్
- ప్లాస్టిక్ ఉత్పత్తులు
- రబ్బర్ టైర్లు
- లెదర్ బ్యాగులు
- మార్బుల్, గ్రానైట్, ప్లాస్టర్, మైకా
- టెంపర్డ్ గ్లాస్
- రేజర్లు
- డిష్ వాషింగ్ మెషీన్లు
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








