జీఈఎస్: ఆటిజంతో బాధపడుతూనే పారిశ్రామిక వేత్తగా ఎదిగిన పదమూడేళ్ల బాలుడు

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హామిష్ ఫిన్లేసన్ అనే 13 ఏళ్ళ అబ్బాయి హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ అబ్బాయి జీఈఎస్‌లో అతిథి.
ఇప్పటికి 5 యాప్స్ తయారు చేసాడు ఇతను. కానీ అంతకు మించిన విషయం ఒకటుంది. ఇతను ఆటిజం బాధితుడు.
''నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా వీడియో గేమ్స్ ఆడుతుంటాను. కోడింగ్ నేర్చుకున్న తరువాత నేనే యాప్స్ తయారు చేస్తున్నాను. నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. కొత్త గేమ్స్ తయారు చేస్తాను. వాటిపై వర్క్ చేస్తాను. గేమింగ్ డిజిటల్ స్పేస్ లో వర్క్ చేయాలని ఉంది నాకు'' అని చెప్పాడు హామిష్.
''ఆటిజం ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. భావోద్వేగాలు గుర్తించడంలో, చదవడం, రాయడంలో తేడాలు ఉంటాయి. కొంతమందికి అద్భుతమైన నైపుణ్యం వస్తుంది. కొందరికి గణితశాస్త్రం బాగా వస్తుంది'' అంటూ హామిష్ తండ్రి ఫిన్లేసన్ ఆటిజం గురించి వివరించారు.
''హామిష్ మాతోనే ఉంటాడు. అతనికి కొన్ని రోజులు బావుంటుంది. కొన్ని రోజులు బావుండదు. స్కూల్‌కి వెళతాడు. అక్కడ లెక్కలు, సైన్స్, టెక్నాలజీ చదువుతాడు. కానీ రాయడం కాస్త ఇబ్బంది'' అన్నారు ఫిన్లేసన్.

ఫొటో సోర్స్, GES-2017.org
హామిష్ తయారు చేసిన యాప్స్‌లో పర్యావరణ పరిరక్షణ, ఆటిజానికి సంబంధించినవి ఉన్నాయి.
''నాకు ఆటిజం ఉంది. ఆటిజం గురించి చాలా మందికి తెలియదు. వాళ్లను చూసి నవ్వుతారు. గేలి చేస్తారు. వాళ్లను వేరుగా చూస్తారు. దాన్ని తగ్గించడానికి, అలా చేసే వారి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆటిజం వాళ్లు సమాజంలో బతకడానికి సహాయపడే యాప్స్ తయారు చేస్తున్నాను'' అని హామిష్ చెప్తున్నాడు.
హామిష్‌కి గేమ్స్, టెక్నాలజీ చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని టెక్నాలజీ వైపు నడిపించింది. అందుకే చాలా చిన్న వయసులో మొబైల్ యాప్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు హామిష్. ఇప్పటివరకూ 5 యాప్స్ తయారు చేశాడు. ఆరో యాప్ తయారు చేసే పనిలో ఉన్నాడు.
మా ఇతర కథనాలు:
- హలో, హలో.. ఈ పొలానికి ఏ చీడ పట్టింది?
- ఈ ఏడాది ఎక్కువ మంది వాడిన పదమేంటో తెలుసా?
- ఫేస్బుక్లో తెలుగు ‘మెర్సల్’.. అప్లోడ్ అండ్ డిలీట్
- ఇక్కడ ఆడపిల్లలు చదువుకోలేరు!
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- ఇవాంకా వస్తున్నారు సరే... అసలేంటి ఈ జీఈఎస్?
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- ఇల్లు కావాలా.. ఇరవై ఏళ్లు ఆగాలి!!
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









