‘ఈ విజయానికి మీరు అర్హులు’- ప్రపంచ కప్ విజేతలపై ప్రశంసల వెల్లువ

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty
సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది.
బీసీసీఐ, సెలెక్టర్లు, ప్రేక్షకులు, జట్టు సభ్యుల మద్దతు వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.
"ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ విజయానికి క్రెడిట్ బీసీసీఐ, సెలెక్టర్లు, మాకు మద్దతు ఇచ్చిన వారందరికీ చెందుతుంది" అని ఆమె అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో, భారత జట్టు లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ‘‘మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఇది అతిపెద్ద పునరాగమనం. ఎందుకంటే భారతదేశం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాంటి సందర్భంలో మీరు జట్టుకు ఏమి చెప్పారు?' అని హర్మన్‌ను అడిగినప్పుడు "మాకు మాపై నమ్మకం ఉంది. ఒక జట్టుగా మేము ఏదైనా చేయగల సామర్థ్యం ఉందని మాకు తెలుసు. జట్టులోని ప్రతీ ఒక్కరు దీనికి అర్హులు" అని హర్మన్‌ప్రీత్ అన్నారు.
భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. గతంలో రెండుసార్లు (2005, 2017) ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఫైనల్‌లో ఓడిపోయింది.

ఫొటో సోర్స్, ANI
మీరు మరింత ఎదగాలి: ద్రౌపది ముర్ము
ప్రపంచ విజేతగా నిలిచిన మహిళల జట్టుకి ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలెబ్రిటీలు అభినందనలు చెబుతున్నారు.
"ఫైనల్ మ్యాచ్‌లో జట్టు అద్భుతంగా ఆడిందని, మహిళల క్రికెట్ రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదుగుతుంది" అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, x.com/imVkohli/status
‘‘మన క్రీడాకారులకు అభినందనలు. ఈ చరిత్రాత్మక విజయం మరింతమంది భవిష్యత్ చాంపియన్లు ఆటలను కెరీర్‌గా తీసుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఇది గర్వించాల్సిన సమయం. భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన విజయం కోటి గుండెలను తాకింది. మీ ధైర్యం భారత దేశానికి కీర్తిని అందించింది. ఇకపై యువతులు నిర్భయంగా క్రీడల గురించి కలలు కంటారు" అని అన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"మీ చేతుల్లో మీరు నిలబెట్టింది ట్రోఫీ కాదు. భారత మహిళల క్రికెట్‌ని. నవతరానికి కాబోయే చాంపియన్లకు మీరే స్ఫూర్తి" అని ఆనంద్ మహీంద్రా ప్రపంచ కప్ విజేతలపై ప్రశంసలు కురిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty
"పెద్ద పెద్ద కలలు కనడంతో పాటు వాటిని సాధించేందుకు 1983 ప్రపంచకప్ విజయం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపింది. భారతీయ మహిళా క్రికెట్‌లో ఇది ప్రత్యేక సందర్భం. వెల్ డన్ టీమ్ ఇండియా. మీరు దేశం గర్వించేలా చేశారు" అని సచిన్ టెండూల్కర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మీ విజయం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. హర్మన్ అండ్ టీమ్ వెల్‌డన్ అంటూ చాంపియన్లకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు విరాట్ కోహ్లీ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"ఉత్కంఠభరిత ఫైనల్. ఈ విజయం1983, 2011నాటి జ్ఞాపకాలను మళ్లీ తీసుకువచ్చింది. టీమ్ ఇండియా మీకు అభినందనలు" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7

ఫొటో సోర్స్, Getty Images
"విమెన్ ఇన్ బ్లూ- ప్రపంచ విజేతలు. తొలిసారిగా ఫైనల్‌లో ఆడిన సౌతాఫ్రికా జట్టుకు అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
"ప్రపంచకప్ గెలవడం ద్వారా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వారి అద్భుత ప్రతిభ, కృత నిశ్చయం, తిరుగులేని స్ఫూర్తి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. చాంపియన్లకు అభినందనలు" అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
"మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచిన మన టీమ్ ఇండియాకు అభినందనలు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10

ఫొటో సోర్స్, Getty Images
"ప్రపంచ కప్ ఫైనల్‌లో తిరుగులేని విజయం సాధించిన జట్టుకు అభినందనలు. ఇలాగే విజయాలు సాధిస్తూ అడ్డుగోడల్ని బద్దలు కొట్టండి" అని టీమ్ ఇండియాను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
ప్రపంచవిజేతలు అంటూ భారతీయ జెండాతో పాటు సెల్యూట్ చేస్తున్న ఎమోజీని పోస్ట్ చేశారు దర్శకుడు రాజమౌళి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
క్రికెట్‌లో విజేతలుగా నిలిచిన మహిళా జట్టుపై ప్రశంసలు గుప్పించారు కల్వకుంట్ల కవిత. "మీ అంకితభావం, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని ఎగసిన తీరు భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపుతుంది" అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 13
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)