తెలంగాణ: కోలాటమాడుతూ, పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఫొటో సోర్స్, Praveen shubham
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పాటలు పాడుతూ కోలాటాలు ఆడి, బతుకమ్మలను సాగనంపారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
తెలంగాణ చరిత్రలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది.

ఫొటో సోర్స్, Praveen Shubham
బతుకమ్మ ఒక పూల పండుగ. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది.

ఫొటో సోర్స్, Praveen Shubham
ఈ పండుగ సందర్భంగా మహిళలు ప్రధానంగా గౌరీ దేవతను ఆరాధిస్తారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
గత వారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుక, ఈ రోజు (ఆదివారం) సద్దుల బతుకమ్మతో ముగిసింది.

ఫొటో సోర్స్, Praveen Shubham
'సద్దుల బతుకమ్మ' సందర్భంగా కోలాటాల అనంతరం, మహిళలు ఊరేగింపులతో బతుకమ్మలను తీసుకెళ్లి, చెరువులు, నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గునుగు, గుమ్మడి, కట్ల పువ్వులు, బంతిపూలతో అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు మహిళలు.

ఫొటో సోర్స్, Praveen shubham
నగరంలోని పద్మాక్షి గుట్ట ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో తరలివచ్చారు. పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
అనంతరం పద్మాక్షి ఆలయ ఆవరణలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బతుకమ్మ ఐకాన్‌గా నిలిచిందని ఉద్యమకారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- పాయింట్ నెమో: అంతరిక్ష నౌకల శ్మశాన వాటిక అని దీనిని ఎందుకు అంటారు?రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















