ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు

వీడియో క్యాప్షన్, ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు
ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు

మహారాష్ట్రలోని పుణె సమీపంలోని పాఛ్ఘర్ గ్రామానికి చెందిన ఒక రైతు దంపతులు తాము పండించిన టమోటాలను అమ్మి కోట్లు సంపాదించారు.

ఇష్వార్ , సోనాలీ గైకర్ దంపతులకు 18 ఎకరాల పొలం ఉంది.

అందులో పన్నెండు ఎకరాల్లో టమోటాలు పండిస్తున్నారు. ఈ ఏడాది పండించిన టమోటాలు వారికి బంపర్ లాభాల్ని తెచ్చిపెట్టాయి.

టమోటా

‘‘మేం ఇప్పుడు కోటి రూపాయలకు పైగానే ఆర్జించాం. కానీ మొదట్లో మేం ఈ పొలం కోసం 35 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాం.

ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే మేం మా పెట్టుబడిని తిరిగి దక్కించుకోగలమో లేదో అన్నది మాకు తెలియదు. అది మార్కెట్ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ సారి మా పంటతో పాటు, ధరలు కూడా పెరిగాయి. కాబట్టి మాకు బాగా లాభాలు వచ్చాయి’’ అని గైకర్ చెప్పారు.

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)