''ఇంట్లో తెలుగు.. స్కూల్లో బర్మీస్"
మియన్మార్‌లో స్థిరపడిన తెలుగువారు కొందరు ఇటీవల హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చారు.
ఆ తర్వాత తెలుగు జాతి ట్రస్టు ట్రస్టీ డీపీ అనూరాధ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని లామాకాన్‌కు వచ్చారు.
వారితో బీబీసీతో మాట్లాడింది. వారిలో చాలామంది తెలుగు నేలపై తొలిసారి అడుగు పెట్టామని చెప్పారు.
సుమారు 150 ఏళ్ల కిందటే భారత్‌తోపాటు మియన్మార్ బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో వ్యవసాయంతోపాటు వివిధ వ్యాపారాల నిమిత్తం పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు మియన్మార్ కు వలస వెళ్లినట్టుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఇలా వెళ్లిన వారిలో ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల వారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో గాన లక్ష్మి పూర్వీకుల కుటుంబం కూడా ఉంది.
తాను పుట్టినప్పట్నుంచి ఇప్పటి వరకు తెలుగు నేలపై అడుగు పెట్టలేదని, ఇప్పుడు రావడం ఎంతో సంతోషంగా ఉందని 67 ఏళ్ల గానలక్ష్మి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Yerra naidu
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









