దిల్లీ చలో: కేంద్రంతో రైతుల చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?

రైతుల ఆందోళన

నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రైతుల ఆందోళనతో పంజాబ్, హరియాణా సరిహద్దుల వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే, అంతకు ముందు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదు. దీని తర్వాతనే ఫిబ్రవరి 13న ‘దిల్లీ చలో’ మార్చ్‌ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు రైతులు.

రైతు సంఘాలను ఆందోళన నుంచి విరమింపజేసేందుకు చండీగఢ్‌లో సోమవారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు, రైతు నేతల మధ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశం చాలాసేపు జరిగినా రైతులను ప్రభుత్వం ఒప్పించలేకపోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కేంద్ర మంత్రులు ఏం చెప్పారు?

ప్రభుత్వం తరపు నుంచి ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చర్చల్లో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం అర్జున్ ముండా మాట్లాడారు.

‘‘రైతు సంఘాలతో చర్చలు చాలా సీరియస్‌గా జరిగాయి. ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఎప్పుడూ కోరుకుంటుంది. ఈ ఉద్దేశంతో మేం చర్చలు జరిపాం. ప్రభుత్వ ప్రతినిధులుగా మేం చర్చల్లో పాల్గొన్నాం’’ అని అర్జున్ ముండా అన్నారు.

‘‘ఏకాభిప్రాయానికి వచ్చిన చోట అన్ని అంశాలు పరిష్కారమయ్యాయి. అయితే, కొన్ని అంశాలకు పరిష్కారం కోసం కమిటీని వేసి, వాటికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది’’ అని ముండా వెల్లడించారు.

ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, SAMEER SEHGAL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గతంలో రైతు ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులు ఏం చెప్పారు?

యునైటెడ్ కిసాన్ మోర్చా కన్వీనర్ జగ్జీత్ సింగ్ ధలివాల్ ఈ చర్చల గురించి మాట్లాడారు.

‘‘సమావేశం చాలాసేపు సాగింది. ప్రతి డిమాండ్‌పై చర్చించారు. వాస్తవానికి మేం చేసేవి డిమాండ్లు కావు. వివిధ సమయాల్లో ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు. వాటిపై ఏకాభిప్రాయానికి బదులు కమిటీ వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకుముందు కూడా ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) ఇస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉంది. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదు. కానీ రూ.14.5 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాత్రం మాఫీ చేసింది’’ అని అన్నారు.

“ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు లేవు. మా ఆందోళన కొనసాగుతుంది. చర్చల్లో మాకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. కానీ, అది జరగలేదు. ప్రభుత్వం మళ్లీ చర్చలకు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని కిసాన్ మజ్దూర్ మోర్చా కోఆర్డినేటర్ ఎస్ఎస్ పంధేర్ అన్నారు.

రైతులతో చర్చల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తాము భావించడం లేదని పంధేర్ అన్నారు.

రైతుల ఆందోళన

ఆందోళన-భద్రతా ఏర్పాట్లు

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 2020లో 32 రైతు సంఘాలు ఉద్యమంలో పాల్గొనగా, ఇప్పుడు 50 రైతు సంఘాలు ఆందోళనకు మద్ధతిస్తున్నాయి. రైతు సంఘాల ప్రధాన డిమాండ్లు.

  • కనీస మద్దతు ధర అమలుకు హామీ ఇవ్వాలి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలి.
  • ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి.
  • రైతుల రుణాలు మాఫీ చేయాలి
  • గత రైతు ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలి.
  • గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించాలి, రోజువారీ వేతనం రూ. 700కు పెంచాలి.

సోమవారం రాత్రి జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం పలు భద్రతా చర్యలను చేపట్టింది

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)