మత్తు వదలరా-2 రివ్యూ: డెలివరీ బాయ్స్‌ స్పెషల్ ఏజెంట్లుగా ఎలా మారారు?

శ్రీసింహ, కీరవాణి, కాలభైరవ, మత్తువదలరా

ఫొటో సోర్స్, MythriOfficial/X

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

సింపుల్ స్టోరీలతో, కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌తో చిన్న సినిమాలు ఎన్నో హిట్ అవుతున్నాయి. 2019లో కీరవాణి తనయుడు శ్రీసింహా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా' సినిమా కూడా అలాంటిదే. ఎక్కువ పాత్రలు, సీరియస్ సెట్టింగ్స్ జోలికి పోకుండా చాలా సింపుల్‌గా నాలుగైదు పాత్రలతో అటు హాస్యాన్ని, ఇటు థ్రిల్‌నూ అందించి హిట్ కొట్టింది ఆ సినిమా.

దీని తర్వాత శ్రీసింహా నాలుగైదు సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. ఇన్నాళ్లకు మళ్లీ 'మత్తు వదలరా'కు సీక్వెల్‌గా 'మత్తు వదలరా-2' సినిమా వచ్చింది. ‘మత్తు వదలరా’ సినిమా హిట్ కావడం వల్ల ఈ సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీసింహ, కీరవాణి, కాలభైరవ, మత్తువదలరా

ఫొటో సోర్స్, MythriOfficial/X

కథ ఏంటి?

‘మత్తు వదలరా’ సినిమాలో డెలివరీ బాయ్స్‌గా ఉన్న బాబు, యేసు ‘మత్తు వదలరా-2’లో స్పెషల్ ఏజెంట్లుగా మారారు. వారు 'హీ టీమ్'లో ఏజెంట్లుగా ఎలా మారారు? ఒక కేసును సాల్వ్ చేసే క్రమంలో అందులో వాళ్లే ఎలా ఇరుక్కున్నారు? దాని నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఆపరేషన్ తస్కర అంటే ఏమిటి? ‘స్లేవ్ డ్రగ్’ అంటే ఏమిటి? అన్నదే కథ.

బాబు, యేసు పాత్రలతో 'మత్తు వదలరా'లో డెలివరీ బాయ్స్‌గా మెప్పించిన శ్రీసింహా, సత్య... ‘మత్తు వదలరా-2’లో కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నారు. పార్ట్-1లో ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్స్ కావడం వల్ల ఈ పాత్రలతో ప్రేక్షకులు ముందు నుంచే కనెక్ట్ అవుతారు.

‘మత్తు వదలరా’లో, కథలో ముందే కామెడీని పరిచయం చేయలేదు. కానీ సీక్వెల్‌గా వచ్చిన ‘మత్తు వదలరా-2’ మాత్రం ఫుల్-ఆన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఓపెన్ అవుతుంది. ‘మత్తు వదలరా’ సినిమా 'స్టోరీ ఓరియెంటెడ్'గా నడిస్తే, ఇప్పుడు ఈ సినిమా 'క్యారెక్టర్ ఓరియెంటెడ్'గా మారింది. కామెడీ టైమింగ్‌కు సీరియస్ ఎలిమెంట్స్, యాక్షన్ వంటి అంశాలూ కలవడంతో కథ ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

మత్తు వదలరా సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, MythriOfficial/X

స్టోరీ ఫ్లో..

‘మత్తు వదలరా-2’లో 'కామిక్ జోనర్'ని హైలైట్ చేసే క్రమంలో ఓపెనింగ్‌లోనూ, మధ్యలోనూ 'సీరియల్' ఎలిమెంట్ లాంటివి కొంత పేలవంగా ఉన్నా, తర్వాత కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.

హీరోల రోల్స్ మారినా, వాళ్ల బేస్ క్యారెక్టర్ మారకుండా ఉండటం వల్ల అటు స్టోరీ, ఇటు పాత్రలు కూడా సహజంగా అనిపిస్తాయి. సీరియస్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉన్న ఈ కథలో, హాస్యం కూడా సహజంగా అనిపిస్తుంది.

ఆరంభం నుంచి లైట్ టోన్‌తో ఉన్న సినిమా స్లోగా, స్ట్రాంగ్ స్టోరీ ఎలిమెంట్‌తో సీరియస్‌గా మారుతుంది. ఇంటర్వెల్‌ వచ్చేసరికి స్టోరీ గ్రిప్పింగ్‌గా మారుతుంది.

ఎక్కడా స్టోరీ ల్యాగ్ లేకుండా, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఇది. స్ట్రాంగ్ స్టోరీ ఫ్లో ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

శ్రీసింహ, కీరవాణి, కాలభైరవ, మత్తువదలరా

ఫొటో సోర్స్, MythriOfficial/X

ఎవరు ఎలా నటించారంటే..

శ్రీసింహా లీడ్ రోల్‌లో చాలా సహజంగా నటించాడు. కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతోనూ, స్టోరీ సీరియస్‌గా మారే కొద్ది దానిలో ‘బాబు’గా బాగా ఇమిడిపోయాడు. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సత్య ఫుల్ లెంగ్త్‌లో ఎంటర్‌టైన్ చేసిన సినిమా ఇది. సినిమా మొత్తంలో సత్య 'అవుట్ అండ్ అవుట్' కామెడీ పండించాడు. సినిమాలో మిగిలిన పాత్రలు ఎన్ని ఉన్నా, స్క్రీన్ మీద చాలాసార్లు ప్రేక్షకులు యేసుదాసు(సత్య)నే చూస్తూ ఉండిపోతారు. ఈ 'సత్య' మ్యాజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ.

మైఖేల్ పాత్రలో సునీల్, నిధి పాత్రలో ఫరియా నటించారు. ఫరియా డైలాగ్ డెలివరీ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. బాబు, యేసు పాత్రలు ఉన్నంత బలంగా ఈ క్యారెక్టర్స్ లేవు. సునీల్, ఫరియా తమ పరిధి మేరకు బాగానే నటించినా, ఈ క్యారెక్టర్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేది.

సాంకేతికంగా..

'మత్తు వదలరా' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన కాలభైరవ తర్వాత 'కార్తికేయ-2', 'కలర్ ఫొటో' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 'మత్తు వదలరా-2'కు, కథతో సమానంగా కాలభైరవ స్ట్రాంగ్‌గా సంగీతం అందించారు.

సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉండటంతో ఇదొక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా మారింది.

కథ ముఖ్యంగా బాబు, యేసు పాత్రల చుట్టూ నడవటం వల్ల మిగిలిన పాత్రలు పేలవంగా ఉన్నా, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉండటం కొంతవరకు ఆ లోటును భర్తీ చేసింది. అలాగే క్లైమాక్స్ 'సెక్స్‌టార్షన్' లాంటి సీరియస్ టాపిక్‌తో ఉండటం కూడా స్టోరీ ప్రెజెన్స్‌ను గ్లోరిఫై చేసింది.

స్ట్రాంగ్ స్టోరీ, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీలతో, ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టెయిన్ చేస్తుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఎంగేజ్ చేస్తూ, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా 'మత్తు వదలరా-2'.

ప్లస్ పాయింట్స్ :

  • ప్రీక్వెల్ నుంచి చక్కటి కనెక్షన్ ఎలిమెంట్‌తో సీక్వెల్‌ను ఎస్టాబ్లిష్ చేయడం
  • సత్య ఫుల్ ఆన్ కామెడీ టైమింగ్
  • సత్య- శ్రీసింహా స్క్రీన్ కెమిస్ట్రీ
  • స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే
  • మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ కాకపోవడం
  • సపోర్టింగ్ పాత్రలకు తగినంత స్కోప్ లేకపోవడం
  • ఫరియా లీడ్ రోల్‌లో ఉన్నా, క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా లేకపోవడం

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)