ది గోట్ సినిమా రివ్యూ: ‘మూడు గంటల సాగదీత.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష’

గోట్ సినిమా

ఫొటో సోర్స్, AGS Entertainment

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వచ్చిన 'గోట్' సినిమా ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన 'గోట్' - 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమా ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్‌లో పని చేసే గాంధీ (విజయ్) కొడుకు కొన్ని కారణాలతో తల్లిదండ్రులకు దూరమవుతాడు.

అయితే, 20 ఏళ్ల తర్వాత కలిసిన కొడుకుతోనే తండ్రి పరోక్ష యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇద్దరికీ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? తప్పిపోయిన కొడుకు ఎక్కడ పెరిగాడు? ఎలా మారాడు? అనేదే 'గోట్' కథ.

ఈ చిత్రంలో ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, అజ్మల్ లాంటి పేరున్న నటులున్నారు.

'యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్' వంటి యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది. కానీ విజయ్ వన్ మ్యాన్ షో‌గా సినిమా నడిపించడంతో కథ బలహీనమైపోయింది. జోనర్‌, స్టోరీకి మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఉందే తప్ప స్టోరీలో, సస్పెన్స్ క్రియేషన్‌లో లేదు.

దర్శకుడు స్టార్ కాస్ట్‌ను తెరపై సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయ్

ఫొటో సోర్స్, X/ArchanaKalpathi

తేడా కొట్టింది అక్కడే

కొంత 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. ఒక పక్క యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో ఉద్యోగం, ఇంకోవైపు కుటుంబ జీవితం. అయితే, ఈ రెండిట్లో ఉండే బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం గాంధీ పాత్రలో కనిపించదు.

లైట్ టోన్ నుంచి సినిమా 'కొడుకు' కారణంగా ఎమోషనల్ రోలర్ కాస్టర్‌గా మారుతుంది. కానీ దీనివల్ల కుటుంబ జీవితంలో ఏర్పడిన కాన్‌ఫ్లిక్ట్ కూడా ఇంకో అరగంటలో తేలిపోతుంది.

అయిదేళ్ల వయసులో చచ్చిపోయాడనుకున్న కొడుకు చాలా సింపుల్‌గా కనిపిస్తాడు. కలిసిపోతాడు. దీంతో స్టోరీలో ఫ్యామిలీ సంఘర్షణ మిస్ అయింది.

సినిమా ఒక సీరియల్ స్టైల్‌లో ఉండటం, ఎంగేజింగ్‌గా లేకపోవడం, మూడు గంటల సాగదీతతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతున్నట్లు అనిపిస్తుంది.

గోట్ సినిమా

ఫొటో సోర్స్, X/Hamsinient

స్నేహ -విజయ్ జోడీ ఎలా ఉంది?

విజయ్, స్నేహల కెమిస్ట్రీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు.

గాంధీ (విజయ్) పాత్రలో ఉండే సిల్లీ టోన్-యూత్ ఫుల్ నెస్, స్నేహ సీరియస్ పాత్రతో జోడీ కుదరలేదు.

మీనాక్షి చౌదరి గ్లామర్ రోల్‌కే పరిమితమయ్యారు. ఈ సినిమా విజయ్ 'వన్ మ్యాన్ షో'గా నడవడం వల్ల మిగిలిన పాత్రలకు ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించదు.

పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మ్యూజిక్ సినిమాకు ప్లస్ కాలేదు.

విజయ్ నటించిన గోట్ సినిమా

ఫొటో సోర్స్, AGS Entertainment

దర్శకత్వం:

విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వచ్చిన ఈ సినిమా అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో అంచనాలను పెంచింది.

ఇప్పటివరకు కొంత కమర్షియల్ హిట్ మార్క్ డైరెక్టర్స్‌తో చేసి, యాక్షన్ సినిమాలతో వెళ్తున్న విజయ్ ఆ జోనర్‌లో పెద్ద సక్సెస్ రికార్డు లేని వెంకట్ ప్రభుతో కలిసి పనిచేశారు.

యాక్షన్ , హీరోయిక్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ అపీలింగ్‌గా ఉండే సినిమాలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విజయ్‌కి.. ఈ 'గోట్' సినిమా కథ, టెక్నికల్ అంశాలు, క్యారక్టరైజేషన్‌ దేనిలోనూ మ్యాచ్ చేయలేకపోయింది.

విజయ్

ఫొటో సోర్స్, X/ArchanaKalpathi

టెక్నికల్‌గా ఎలా ఉంది?

'డీ ఏజింగ్' టెక్నాలజీతో గాంధీ కొడుకు పాత్రలో విజయ్ డ్యూయల్ రోల్‌ను డెవలప్ చేశారు.

అలాగే గాంధీ కొడుకును అనేక దశల్లో (జూనియర్ గాంధీ ) వివిధ రకాలుగా చూపించడం అతిగా అనిపిస్తుంది.

అనేక లేయర్స్ ఉన్న ఈ పాత్ర చివరకు ఒక యాంత్రిక పాత్రలా అనిపించింది.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా పాపులర్ హాలీవుడ్ సినిమాల సీక్వెన్సులను గుర్తుకు తెస్తాయి. అయితే, ఈ యాక్షన్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ కాలేదు.

మొత్తం పాత కథలను మిక్సీలో వేసి ఒక కొత్త కథను వండి, మూడు గంటల సేపు లాగి, ప్రేక్షకుడిని మెప్పించలేకపోయిన సినిమా 'గోట్.'

ప్లస్‌లు - మైనస్‌లు

ప్లస్ పాయింట్స్:

1) స్టార్ కాస్ట్ కొన్ని చోట్ల స్క్రీన్ మీద తళుక్కుమనడం

2) స్నేహ

3) ప్రీ క్లైమాక్స్‌లో మలుపులు

5) త్రిషతో విజయ్ మస్తీ సాంగ్

మైనస్ పాయింట్స్:

1) బలహీనమైన స్క్రీన్ ప్లే

3) దర్శకత్వం

4) పాత్రలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం

5) సినిమాటోగ్రఫీ

6) ఒరిజినాలిటి లోపించడం

(అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

వీడియో క్యాప్షన్, GOAT Movie Review: విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)