టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు ఒడ్డుకు తీసుకొచ్చారు

Titan sub wreckage

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

మునిగిపోయిన టైటానిక్ షిప్‌ శిథిలాలు చూడ్డానికి అయిదుగురితో అట్లాంటిక్ సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో పేలిపోయిన టైటానిక్ సబ్ శకలాలను ఒడ్డుకు తీసుకొచ్చారు.

కెనడాలోని సెయింట్ జోన్స్‌లో హారిజాన్ ఆర్కిటిక్ షిప్‌లో ఈ లోహ శకలాలను తెచ్చారు.

టైటాన్ సబ్‌కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్‌లోకి మార్చారు.

ఆ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.

టైటాన్ సబ్‌కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు.

Debris from the Titan submersible are lifted by a crane

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

టైటాన్ సబ్ ప్రమాదం ఇలా..

సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌకను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు.

ప్రమాదంలో ఈ అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు.

టైటాన్ సబ్ శిథిలాలు

ఫొటో సోర్స్, CBC NEWFOUNDLAND AND LABRADOR

టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్‌ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది.

ఈ జలాంతర్గామికి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)