ఆంధ్రప్రదేశ్: ‘కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు’

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25ఏళ్ల యువతిని ఆమె ప్రేమికుడు కత్తితో పొడిచి చంపినట్లు కర్నాటక పోలీసులు తెలిపారు.
ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నలమతి(25), శ్రీకాకుళానికి చెందిన దినకర్ బాణాల(28) ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడం వల్ల వారి పెళ్లికి పవిత్ర కుటుంబం అంగీకరించలేదు.
‘కులాలు వేరు కావడం వల్ల తమ కుటుంబం పెళ్లికి ఒప్పుకోవడం లేదని దినకర్‌కు లీల చెప్పింది. ఇంట్లో వాళ్ల మాటను తాను కాదనలేనని కూడా తెలిపింది’ అని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈస్ట్) బీమశంకర్ గులేద్ తెలిపారు.
లీల కుటుంబం చౌదరి కాగా దినకర్‌ది గౌడ కులమని బీబీసీకి బీమశంకర్ వెల్లడించారు.
సుమారు అయిదేళ్ల కిందట ఒక హెల్త్‌కేర్ కంపెనీలో పని చేసేటప్పుడు లీల, దినకర్ ప్రేమించుకున్నారు. ఆ తరువాత ఇద్దరు వేరువేరు కంపెనీలలో పని చేసినప్పటికీ వారి ప్రేమ కొనసాగిందని పోలీసులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రస్తుతం లీల బెంగళూరులోని ఒమెగా హెల్త్‌కేర్‌లో పని చేస్తోంది.
మంగళవారం సాయంత్రం సుమారు 7.30 గంటల ప్రాంతంలో బెంగళూరులో లీల పని చేసే ఆఫీసుకు దినకర్ వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా తాను పెళ్లి చేసుకోలేనని లీల చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆ తరువాత ఆఫీసు బటయకు వచ్చిన దినకర్, ఆ అమ్మాయి కోసం బయటనే వేచి ఉన్నాడు. ఆఫీసులో పని అయిపోయిన తరువాత లీల బయటకు వచ్చింది. కొద్ది రోజులుగా లీల తనను కలవకపోవడంతో కోపంతో ఉన్న దినకర్, ఆ యువతిని కత్తితో చాలా సార్లు పొడిచాడు. లీలను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ వివరించారు.
అందరూ చూస్తుండగానే దినకర్ సుమారు 10 సార్లు కత్తితో పొడిచినట్లుగా పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తరువాత కచ్చితంగా ఎన్ని పోట్లు పడ్డాయో తెలుస్తుందని వారు చెప్పారు. నిందితుడు దినకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘ప్రేమను తిరస్కరిస్తే ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు ప్రేమికులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకించి అమ్మాయిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలను మనం పెంచడంలో లోపం ఉంది. తిరస్కరణను స్వీకరించేలా యువతను సిద్ధం చేయకపోతే ఇలాంటి ఘటనలను మరిన్ని చూడాల్సి ఉంటుంది’ అంటూ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- స్వర భాస్కర్-ఫర్హాద్ అహ్మద్: హిందూ, ముస్లిం ప్రేమికులు పెళ్లి చేసుకోవాలంటే ఎలా... స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది?
- ‘నవీన్‌ను చంపేసి, తల నరికి, గుండెను బయటకు తీశాను...’ పోలీసుల రిమాండ్ రిపోర్టులో హరిహరకృష్ణ నేరాంగీకారం
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
- ‘బ్రిటిష్ పాలన’ విడదీసిన కుటుంబాలను ఆయన ఎలా కలుపుతున్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








