‘మెలిస్సా’ తీవ్రత 10 ఫోటోల్లో..

ఫొటో సోర్స్, Andrew Holness/X
కరీబియన్ దీవులను హరికేన్ మెలిస్సా అతలాకుతలం చేస్తోంది. దీని ధాటికి అనేక ఇళ్లు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాలను వరద చుట్టముట్టింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
జమైకాలో ఈ హరికేన్‌ను కేటగిరీ ఫైవ్ మాన్‌స్టర్‌గా వర్గీకరించారు. ఇది ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చినవాటిలో అత్యంత శక్తిమంతమైన హరికేన్‌గా చెబుతున్నారు. దీని కారణంగా ఇప్పటివరకు నలుగురు మరణించారు.
హైతీలో మెలిస్సా కారణంగా మరో 20 మంది చనిపోయారు.
మెలిస్సా కారణంగా జరిగిన నష్టం "హృదయ విదారకరం" అని జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్‌నెస్ చెప్పారు. తాను పర్యటించిన ఒక పట్టణం పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు.

ఫొటో సోర్స్, IOM/X
నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు పలు ప్రాంతాల్లో జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్‌నెస్ పర్యటిస్తున్నారు.
అంతకుముందు బ్లాక్ రివర్‌లోని ఒక పట్టణం పూర్తిగా నాశనమైందని బీబీసీతో ఆయన చెప్పారు.
ఆయన తాజా అప్‌డేట్‌లో సెయింట్ ఎలిజబెత్‌లో ఆయన తన పర్యటన ముగించారని చెప్పారు. అక్కడ జరిగిన విధ్వంసం "హృదయ విదారకరం"గా ఉందని చెప్పారు. అయితే ప్రజల్లో స్ఫూర్తి మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, AFP via Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














