క్లౌడ్ బరస్ట్: కిష్త్వార్‌లో వరద అనంతర దృశ్యాలు, కన్నీళ్లు పెట్టించే ఫోటోలలో...

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ చషోటి ప్రాంతంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
ఈ విపత్తులో ఇప్పటి వరకు 60 మృతదేహాలు లభించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.
100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సర్వీసులు, సీఐఎస్ఎఫ్, సైన్యం ఇలా అనేక విభాగాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.
కనీసం 70 మందిని వివిధ ఆసుపత్రులలో చేర్పించారని కిష్త్వార్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం బీబీసీకి తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ విషాదం అనంతరం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులు...9 ఫోటోలలో...


ఫొటో సోర్స్, Getty Images
కిష్త్వార్ జిల్లా పడ్దర్ ప్రాంతంలో గాయపడిన వ్యక్తిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లౌడ్ బరస్ట్ వల్ల ధ్వంసమైన ఇళ్లు ఇలా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సహాయ కార్యక్రమాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది.

ఫొటో సోర్స్, Getty Images
క్లౌడ్ బరస్ట్ దెబ్బతిన్న వాహనాన్ని పరిశీలిస్తున్న స్థానికుడు.

ఫొటో సోర్స్, Getty Images
దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

ఫొటో సోర్స్, SDMA
ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ కశ్మీర్‌లో కూడా క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరగడంతో వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 51 మంది మరణించినట్లు సమాచారం.

ఫొటో సోర్స్, SDMA
ఆకస్మిక వరదల కారణంగా ఖైబర్-పఖ్తూంఖ్వా, పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలామంది వరద నీటిలో కొట్టుకుపోగా, అనేకమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, SDMA
పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్‌లోని నీలం లోయలో చిక్కుకున్న 550 మంది పర్యాటకులను రక్షించినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ తెలిపింది. మరో 300 మందికి పైగా పర్యాటకులు ఇప్పటికీ చిక్కుకుపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














