అనకాపల్లి: టాటా నగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, ఒకరు మృతి

ఫొటో సోర్స్, UGC
దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా నగర్ -ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు.
రైలులోని ఏసీ కోచ్‌లైన బి1, ఎం2 బోగీలలో మంటలు వ్యాపించాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.
అర్ధరాత్రి 3.30 గంటల తర్వాత మరొక రైలులో ప్రయాణికులను తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ఈ లైనులో వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
రైలులో ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బి1, ఎం2 ఏసీ బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల్ని గుర్తించిన లోకో పైలట్లు యలమంచిలి స్టేషన్‌లో రైలును ఆపేశారు.

ఫొటో సోర్స్, UGC
రైలు అనకాపల్లి నుంచి బయలుదేరి నర్సింగపల్లి మీదగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బి1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
"ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారనీ, వారి అందరి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు నిర్థరించుకున్నాం. కొందరు ప్రయాణికుల సామగ్రి కాలిపోయింది" అని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు

ఫొటో సోర్స్, UGC
టాటా నగర్ -ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది.
ప్రమాదం జరిగినప్పుడు ఈ రెండు కోచ్‌లలో 158 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎం2లో 82 మంది, బి1లో 76 మంది ప్యాసింజర్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ప్రమాదం జరిగిన వెంటనే రైలులోని ప్రయాణీకులు భయాందోళనలతో రైలు దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఫొటో సోర్స్, UGC
స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చారు.
ప్రమాదంలో రెండు బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి కాలిపోయింది.

ఫొటో సోర్స్, UGC
రైలులోని రెండు బోగీలు కాలిపోవడంతో ప్రయాణికులంతా అర్థరాత్రి చలిలో ఆరు బయట గడపాల్సి వచ్చింది.
దాదాపుగా 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే ఉండిపోయారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత, రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించారు.

ఫొటో సోర్స్, UGC
ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందరం అనే 70 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు.
‘‘ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం’’ అని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














