నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్

నాగేశ్వర్ రెడ్డి, బాలకృష్ణ

ఫొటో సోర్స్, aighospitals, /FB

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి వైద్య విభాగంలో ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని పద్మ విభూషణ్‌కు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించారు.

ప్రజావ్యవహారాల విభాగంలో తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అందుకోనున్నారు. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించారు.

సాహిత్యం, విద్య విభాగంలో కేఎల్ కృష్ణను పద్మశ్రీకి ఎంపిక చేశారు. కళల విభాగంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిరియాల అప్పారావుకు (మరణానంతరం) పద్మశ్రీ ప్రకటించారు.

సాహిత్యం, విద్య విభాగంలో ఏపీకి చెందిన వడిరాజ్ రాఘవేంద్రచార్య పంచముఖి పద్మశ్రీ అందుకోనున్నారు.

ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు ఎం.టి.వి వాసుదేవన్ నాయర్‌కు కేరళ నుంచి సాహిత్యం, విద్య విభాగంలో పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం.

సీనియర్ హీరోయిన్ శోభన, తమిళ నటుడు విజయ్‌కి కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించింది.

కన్నడ నటుడు అనంతనాగ్‌ను కళల విభాగంలో పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది.

బిహార్‌ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీకి (మరణానంతరం) ప్రజావ్యవహారాల విభాగంలో పద్మ భూషణ్ ప్రకటించింది.

క్రీడా విభాగంలో హాకీ మాజీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్‌కు పద్మభూషణ్‌, మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌‌కు పద్మశ్రీ ప్రకటించింది.

మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం, 19 మందిని పద్మ భూషణ్‌కు ఎంపిక చేసింది. 113 మందికి వివిధ విభాగాల్లో పద్మశ్రీ ప్రకటించింది. 23 మంది మహిళలకు పద్మ అవార్డులు లభించాయి. 13మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది.

పద్మ విభూషణ్‌కు ఎంపికైన వారు

  • దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
  • ఎం.టి.వి. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య)- కేరళ
  • లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక
  • జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్
  • కుముదిని రజినీకాంత్ లఖియా (కళలు) గుజరాత్
  • శారదా సిన్హా (కళలు) - బిహార్
  • ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పద్మ భూషణ్‌కు ఎంపికైనవారు

  • నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్
  • ఎస్. అజిత్ కుమార్ (కళలు) తమిళనాడు
  • శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు
  • అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటక
  • ఎ. సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - కర్ణాటక
  • నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
  • జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ
  • పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ
  • శేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర
  • బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్సీటీ దిల్లీ
  • జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం
  • కైలాశ్ నాథ్ దీక్షిత్ (అదర్స్- ఆర్కియాలజీ)- ఎన్సీటీ దిల్లీ
  • మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
  • పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) గుజరాత్
  • పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు)- మహారాష్ట్ర
  • రామ్‌బహదూర్‌రాయ్(సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తరప్రదేశ్
  • సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తరప్రదేశ్
  • సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) బిహార్
  • వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా
 మందకృష్ణ మాదిగ

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB

ఫొటో క్యాప్షన్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ లభించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు

  • మందకృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు) – తెలంగాణ
  • మాడుగుల నాగఫణిశర్మ (కళలు)- ఆంధ్రప్రదేశ్
  • కేఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య)- ఆంధ్రప్రదేశ్
  • మిరియాల అప్పారావు(మరణానంతరం)(కళలు) - ఆంధ్రప్రదేశ్
  • వడిరాజ్ రాఘవేంద్రచార్య పంచముఖి(సాహిత్యం, విద్య) - ఆంధ్రప్రదేశ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)